మార్కెట్ లోకి రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసింది కంపెనీ. రియల్ మీ జీటీ8 ప్రో పేరుతో ఈ మొబైల్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేశారు. అయితే భారత్ మార్కెట్ లో రియల్ మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.
Read Also:Winter Bath: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా..
రియల్ మీ కంపెనీ రియల్ మీ జీటీ8 ప్రో పేరుతో భారతీయ మార్కెట్ లోకి సరికొత్త మొబైల్ ను లాంచ్ చేశారు. అయితే.. ఇది 6.79 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్.. 7000 mah బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఆండ్రాయిడ్ 16 వెర్షన్ ఆధారంగా ఈ మొబైల్ వర్క్ చేయనున్నట్లు వెల్లడించారు. 50 ఎంపీ కెమెరా.. 50 ఎంపీ అల్ట్రా వైడ్, 200 ఎంపీ టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ తో మార్కెట్లో విడుదల చేసింది కంపెనీ. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా.. ఈ ఫోన్ కు 120w , 50W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది. 12GB + 256GB వేరియంట్ ఉన్న ఈ మొబైల్ ధర Rs. 72,999గా ఉంది. 16GB + 512GB వేరియంట్ ధర Rs. 78,999గా ఫైనల్ చేశారు..
