Site icon NTV Telugu

Realme ‘ Christmas Sale’ : అమెజాన్‌లో రియల్‌మి క్రిస్మస్ సేల్.. ఆ ఫోన్ల పై భారీ తగ్గింపు..

Realme (2)

Realme (2)

ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు కొట్ట ఆఫర్స్ ను ప్రకటిస్తుంది.. ఈ కంపెనీ క్రిష్టమస్ సేల్ ను ప్రారంభించింది.. అందులో రియల్‌మి ‘క్రిస్మస్ సేల్’లో భాగంగా రియల్‌మి నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, రియల్‌మి నార్జో ఎన్53తో సహా అనేక రకాల మోడల్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్రమోషన్‌లు డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 26 వరకు అందుబాటులో ఉంటాయి.. రియల్ మీ కంపెనీ వెబ్ సైట్ లలో కూడా అందుబాటులో ఉన్నాయి..

రియల్‌మి నార్జో 60 ప్రో 5జీ డిస్కౌంట్ ధరలు, కూపన్ బెనిఫిట్స్‌తో విభిన్న కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది. సేల్ సమయంలోఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. 12జీబీ +1టీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 29,999కు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు రూ. 27,999 తగ్గింపు ధరతో పాటు రూ. 2వేల కూపన్ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు..

రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీతో పాటు హై-పర్ఫార్మెన్స్ డివైజ్‌లపై భారీగా తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఈ ఫోన్లలో 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌ను కలిగిన నార్జో 60 5జీ, ఇప్పుడు అసలు రూ. 17,999 నుంచి రూ.15,499 ధరకు తగ్గింది. రూ. 2,500 కూపన్ బెనిఫిట్స్ అందిస్తుంది. రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ విషయానికొస్తే.. 6జీబీ+128బీబీ వేరియంట్ ఇప్పుడు రూ. 12,999 తగ్గింపు ధరతో అందిస్తోంది..

మరో బడ్జెట్ ఫోన్ రియల్‌మి నార్జో ఎన్55తో పాటు డిస్కౌంట్‌లు, కూపన్‌ల ద్వారా తగ్గింపు ధరలను అందిస్తుంది. వివిధ ధరల బ్రాకెట్‌లలో అనేక ఆప్షన్లను అందిస్తోంది. రియల్‌మి 6జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌ను కలిగిన నార్జో ఎన్55 అసలు ధర రూ. 12,999 నుంచి తగ్గడంతో ప్రస్తుతం రూ.9999 రూపాయలకు వస్తుంది..రియల్‌మి నార్జో ఎన్53 అసలు ధర రూ. 8,999 నుంచి రూ. 7,999 తగ్గింపు అందిస్తోంది.. ఈ ఫోన్ పై రూ.1000 రూపాయల వరకు కూపన్ ను పొందవచ్చు..

Exit mobile version