Site icon NTV Telugu

ఓపెన్-ఇయర్ డిజైన్, IP55 రేటింగ్‌, 36 గంటల బ్యాటరీతో Realme Buds Clip లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!

Realme Buds Clip

Realme Buds Clip

Realme Buds Clip Launch: స్మార్ట్ ఆడియో విభాగంలో రియల్‌మీ (Realme) మరో కొత్త ప్రయోగానికి తెరలేపింది. తొలిసారిగా క్లిప్ స్టైల్ ఓపెన్ ఫిట్ (clip style open fit) డిజైన్ తో రూపొందించిన రియల్‌మీ బడ్స్ క్లిప్ (Realme Buds Clip)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సంప్రదాయ TWSలకు భిన్నంగా.. ఈ ఇయర్‌బడ్స్ చెవిని పూర్తిగా మూసివేయవు. దీని వల్ల ఎక్కువ సేపు ఉపయోగించినా అసౌకర్యం లేకుండా.. చుట్టూ ఉన్న శబ్దాలు వినిపించేలా డిజైన్ చేశారు.

AI ఇన్‌స్టంట్ క్లిప్, IP69 రెసిస్టెంట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్తో Realme P4 Power 5G భారత్లో లాంచ్..

డిజైన్ & బిల్డ్ క్వాలిటీ:
ప్రతి ఇయర్‌బడ్ బరువు కేవలం 5.3 గ్రాములు మాత్రమే ఉంది. అలాగే ఇది మెటల్ స్ట్రక్చర్‌తో పాటు ఫ్రాస్టెడ్ ఫినిష్ ఇచ్చారు. దీనిని చెమట, రోజువారీ వాడకానికి తట్టుకునేలా రూపొందించారు. ఇకేనా క్లిప్ స్టైల్ ఓపెన్ డిజైన్ కారణంగా చెవిపై ఒత్తిడి లేకుండా సౌకర్యంగా ఉంటుంది.

ఆడియో అనుభవం:
రియల్‌మీ బడ్స్ క్లిప్ లో 11mm డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్ ఉంది. దీనికి తోడుగా NextBass ఆల్గోరిథమ్ పనిచేస్తూ బాస్‌ను మెరుగుపరుస్తుంది. ఇంకా వోకల్స్ స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. అంతేకాదు.. 3D స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో మరింత వైడ్ & డీప్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. ఓపెన్ డిజైన్‌ లోనూ శబ్దం బయటకు ఎక్కువగా లీక్ కాకుండా డైరెక్షనల్ సౌండ్ లీప్ టెక్నాలజీను ఉపయోగించారు.

ప్రీమియం డిజైన్ + పవర్‌ఫుల్ AI.. REDMI Note 15 Pro సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!

స్మార్ట్ ఫీచర్లు:
కాల్ సమయంలో స్పష్టమైన వాయిస్ కోసం డ్యూయల్ మైక్‌తో కూడిన AI ENC అందించారు. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ సపోర్ట్ ఉండటంతో ఒకేసారి మొబైల్, ల్యాప్‌ టాప్‌ లకు కనెక్ట్ చేయవచ్చు. ఇంకా గేమింగ్, వీడియోల కోసం 45ms లో లేటెన్సీ తగ్గించే గేమ్ మోడ్ కూడా ఉంది. వీటితోపాటు ట్యాప్ కంట్రోల్స్, Gemini ఆధారిత AI వాయిస్ అసిస్టెంట్, Find My Earphones ఫీచర్ కూడా అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ & ప్రొటెక్షన్:
ఒకసారి ఫుల్ చార్జ్‌తో కలిపి 36 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని రియల్‌మీ చెబుతోంది. అదే విధంగా IP55 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ లభిస్తుంది.

Phone Tapping కేసులో సంచలనం.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు?

ధర:
వీటి ధరను రూ. 5,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ. 5,499కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఇయర్‌బడ్స్ ఫిబ్రవరి 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. ఆఫర్ గడువు ఫిబ్రవరి 7 రాత్రి 11:59 వరకు మాత్రమే ఉండనుంది.

Exit mobile version