Site icon NTV Telugu

200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తున్న Realme 16 Pro 5G!

Realme 16 Pro 5g Launch

Realme 16 Pro 5g Launch

రియల్‌మీ 16 ప్రో సిరీస్ భారతదేశంలో అతి త్వరలో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. లాంచ్ తేదీని త్వరలో ప్రకటిస్తామని రియల్‌మీ పేర్కొంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో+ మోడల్‌లు ఉండనున్నాయి. రియల్‌మీ విడుదల చేసిన టీజర్ ఇమేజ్‌లో స్లిమ్ డిజైన్ ఉన్న ఫోన్ కనిపిస్తుంది. ఇందులో గోల్డెన్-టోన్ మిడిల్ ఫ్రేమ్, వెనుక కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. ఇది రియల్‌మీ 16 ప్రో సిరీస్‌లోని మోడల్ అని టిప్‌స్టర్స్ అంటున్నారు.

టిప్‌స్టర్స్ లీక్స్ ప్రకారం… రియల్‌మీ 16 ప్రో ఫోన్ 6.78-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే రానుంది. ఇది 2.5GHz ప్రాసెసర్, Android 16 ఆధారంగా Realme UI 7ని కలిగి ఉండనుంది. ఇది వేగవంతమైన పనితీరును ఇస్తుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుంది. ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉండగా.. అది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది దీర్ఘకాలిక ఛార్జింగ్‌ను అందిస్తుంది.

రియల్‌మీ 16 ప్రో ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, IR బ్లాస్టర్ ఉండనున్నాయి. 12GB RAM, 512GB వరకు స్టోరేజ్ సామర్థ్యంతో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్ పరంగా అద్భుతంగా ఉండనుంది. ఇది 7.75mm సన్నగా, దాదాపు 192 గ్రాముల బరువు ఉంటుంది. ఈఫోన్ గ్రే, గోల్డ్, పర్పుల్ రంగు ఎంపికలలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version