Site icon NTV Telugu

IP69 రేటింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరా, 7000mAh భారీ బ్యాటరీతో Realme 15T లాంచ్కు సిద్ధం!

Realme 15t

Realme 15t

Realme 15T: రియల్‌మీ (Realme) మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. గత నెలలో రియల్‌మీ 15, 15 ప్రో మోడల్స్‌ను విడుదల చేసిన తర్వాత ఇప్పుడు రియల్‌మీ 15T స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో అధికారికంగా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

డిజైన్ & డిస్‌ప్లే:
రియల్‌మీ 15T డిజైన్ పరంగా ఒక కొత్త స్థాయిని తెరలేపుతుంది. దీనికి కారణం మొబైల్ కేవలం 7.79mm స్లిమ్ బాడీ, 181గ్రా లైట్ వెయిట్‌తో 7000mAh టైటాన్ బ్యాటరీని డిజైన్ చేశారు. IP66, IP68, IP69 రేటింగ్‌లు ఉండటం వల్ల నీరు, ధూళి, స్పిల్స్ మాత్రమే కాకుండా ఎక్స్‌ట్రీమ్ అవుట్‌డోర్ పరిస్థితులలో కూడా బాగా పని చేస్తుంది. టెక్స్చర్డ్ మ్యాట్ 4R డిజైన్ ప్రత్యేకత, నానో-స్కేల్ మైక్రోక్రిస్టలైన్ లిథోగ్రఫీతో నిర్మాణం వల్ల ఫింగర్‌ప్రింట్-రెసిస్టెంట్, యాంటీ-స్లిప్ ఫినిష్ ఇస్తుంది. 93% స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.57 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 4000 నిట్స్ బ్రైట్నెస్, 10-bit కలర్ డెప్త్, 2160Hz PWM డిమ్మింగ్‌తో కళ్లకు హానికరం కాకుండా అత్యుత్తమ విజువల్ అనుభవం ఇస్తుంది.

iPhone 17 Price: యాపిల్ లవర్స్‌కు షాక్.. ఐఫోన్‌ 17 సిరీస్‌ ధరల పెంపు! ఎంతో తెలుసా?

బ్యాటరీ:
రియల్‌మీ 15T లోని 7000mAh బ్యాటరీ దీర్ఘకాలిక వినియోగం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 10W రివర్స్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉండటంతో ఇతర డివైజ్‌లను కూడా చార్జ్ చేసుకోవచ్చు. గేమింగ్, హెవీ యూజ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా 6050mm² ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్ సహాయపడుతుంది. డిమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్‌తో మంచి పనితీరు, ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0తో 3 OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.

కెమెరాలు:
రియల్‌మీ 15T కెమెరా విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇందు కోసం 50MP ఫ్రంట్ అండ్ రియర్ AI కెమెరాలు ఇందులో ప్రత్యేక ఆకర్షణ. వెనుక 50MP మెయిన్ సెన్సార్‌తో పాటు సెకండరీ సెన్సార్ ఉండగా, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ముందు 50MP సెల్ఫీ కెమెరా గ్రూప్ సెల్ఫీస్, వ్లాగింగ్ కోసం ప్రొఫెషనల్ లెవెల్ ఫలితాలు ఇస్తుంది. AI Edit Genie, AI Snap Mode, AI Landscape, AI బ్యూటిఫికేషన్, స్మార్ట్ ఇమేజ్ మ్యాట్టింగ్, అలాగే డేజా వూ, రెట్రో, మిస్టీ, గ్లోవీ, డ్రీమీ వంటి ప్రత్యేక ఫిల్టర్స్ ఫోటోలు, వీడియోలకు కొత్త క్రియేటివ్ టచ్ ఇస్తాయి.

CM Chandrababu : ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

రియల్‌మీ 15T ఫ్లోఇంగ్ సిల్వర్, సిల్క్ బ్లూ, సూట్ టైటానియం రంగుల్లో అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 2 లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ సైట్స్ లో, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version