స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ రియల్ మీ భారత మార్కెట్ లోకి రియల్ మీ 14 ప్రో సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. రేపు మధ్యాహ్నం(జనవరి 16) 12 గంటలకు ఈ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. రియల్‌మి 14 ప్రో సిరీస్‌లో భాగంగా రియల్‌మి 14 ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఫోన్ లో లేని ఫీచర్లతో వస్తున్నాయి. కలర్ ఛేంజింగ్, ట్రిపుల్ ఫ్లాష్ వంటి యునిక్ పీచర్లతో రియల్ మీ 14 ప్రో సిరీస్ ఫోన్లు విడుదలకానున్నాయి.
ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇవి పెరల్ వైట్, స్వెడ్ గ్రే కలర్ ఆప్షన్‌లతో పాటు రెండు ఇండియా-ఎక్స్‌క్లూజివ్ షేడ్స్ బికనీర్ పర్పుల్, జైపూర్ పింక్‌లలో లభించనున్నాయి. రియల్‌మి 14 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ట్రిపుల్ ప్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుందని రియల్‌మి తెలిపింది. దీంతోపాటు కోల్డ్ సెన్సిటివ్ కలర్ ఛేంజింగ్ డిజైన్‌తో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. IP66+ IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను అందించారు. రియల్‌మి 14 ప్రో 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 6000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. రియల్ మీ ఇప్పటికే కోల్డ్ సెన్సిటివ్ కలర్ ఛేంజింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఇది 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో పెర్ల్ వైట్ వేరియంట్‌ను వైబ్రెంట్ బ్లూగా మారుస్తుంది. క్వాడ్ కర్వ్డ్ డిస్ల్పేతో వస్తుంది. బెటర్ వ్యూ కోసం స్లిమ్ బెజెల్ తో రూపొందించారు. 1.5k డిస్ల్పే రిసొల్యూషన్ తో వస్తుంది. మ్యాజిక్ ట్రిపుల్ ఫ్లాష్ తో ఎలాంటి లైట్ లో ఉన్నా ఫోటోలు క్లియర్ గా వస్తాయి. ఆకర్షనీయమైన డిజైన్ తో రియల్ మీ 14 సిరీస్ ఫోన్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.