IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!

  • గ్లోబల్ మార్కెట్‌లో POCO X8 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్..
  • 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే
  • 8,340mAh సిలికాన్-కార్బన్ బ్యాట
  • ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్..
Poco X8 5g

Poco X8 5g

POCO X8 5G: గ్లోబల్ మార్కెట్లో టెక్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని పోకో కొత్తగా పోకో X8 5Gను తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, పెద్ద 1.5K OLED డిస్‌ప్లే, బలమైన బిల్డ్, అధునాతన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించింది. ముఖ్యంగా 8,340mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

1.5K OLED డిస్‌ప్లే:

పోకో X8 5Gలో 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 3,200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్, 12-bit కలర్ డెప్త్, HDR10+ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్క్రీన్‌లో 240Hz టచ్ శాంప్లింగ్, 3,200Hz వరకు ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్, 3,840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు TÜV Rheinland ఐ కేర్ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను ఉపయోగించారు. ఇది మూడు మీటర్ల ఎత్తు వరకు పడిపోయిన సందర్భాల్లో కూడా మెరుగైన రక్షణ అందించేలా రూపొందించారు.

భారీ బ్యాటరీ:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో 8,340mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీను అందించారు. ఇందులో 13% సిలికాన్ కంటెంట్ ఉపయోగించారు. గత మోడల్‌తో పోలిస్తే బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 63.2% పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు రోజులకు పైగా ఉపయోగించుకోవచ్చని పోకో పేర్కొంది. సుమారు 1,600 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా బ్యాటరీ కనీసం 80 శాతం సామర్థ్యాన్ని కొనసాగిస్తుందని కంపెనీ చెబుతోంది. సాధారణ వినియోగంలో ఇది దాదాపు ఆరు సంవత్సరాల వరకు బ్యాటరీ పనితీరుకు సమానమని తెలిపింది. బ్యాటరీకి TÜV SÜD నుంచి 5-స్టార్ బ్యాటరీ పనితీరు సర్టిఫికేషన్ కూడా లభించింది. ఛార్జింగ్ కోసం 67W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇతర ఫోన్లు, గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసేందుకు 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు.

IP69K రేటింగ్:

బిల్డ్ క్వాలిటీ విషయంలోనూ మొబైల్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. దుమ్ము, నీరు, అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతలతో కూడిన నీటి ప్రవాహం వంటి పరిస్థితులను తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించారు. ఇందులో ప్రత్యేకంగా అండర్ వాటర్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా నీటిలో ఫోన్‌ను ఉపయోగిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రాసెసర్‌:

ఈ కొత్త మొబైల్ లో Qualcomm Snapdragon 6s Gen 4 4nm మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇందులో Adreno GPU ఉండటంతో సాధారణ వినియోగంతో పాటు 3D గేమింగ్‌కు కూడా మెరుగైన పనితీరు అందించనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3పై పనిచేస్తుంది. Xiaomi HyperIsland ఇంటర్‌ఫేస్‌తో పాటు గూగుల్ జెమినీ AI అసిస్టెంట్‌ను కూడా ఇందులో అందించారు. ఆఫ్-గ్రిడ్ పరిస్థితుల్లో కనెక్టివిటీ కోసం Xiaomi Offline Communication ఫీచర్, స్పీకర్‌లో 300% వరకు వాల్యూమ్ బూస్ట్ మోడ్ ఉన్నాయి.

కెమెరా:

ఫొటోగ్రఫీ కోసం 50MP మెయిన్ కెమెరాను అందించారు. ఇది OIS, EIS రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. దీనికి 2MP డెప్త్ సెన్సార్ జత చేశారు. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఒకేసారి ముందు, వెనుక కెమెరాలతో వీడియో రికార్డ్ చేసేందుకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ఉంది. AI ఆధారిత Glare Removal, Erase Pro, Image Expansion, Image Enhancement, AI Beautify వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ధర ఎంత?

గ్లోబల్ మార్కెట్‌లో POCO X8 5G ధరలు ఇలా ఉన్నాయి..

* 6GB + 128GB: 269 డాలర్లు (రూ.25,540).
* 8GB + 256GB: 299 డాలర్లు (రూ.28,385).
* 12GB + 256GB: 349 డాలర్లు (రూ.33,135).

POCO X8 5G త్వరలోనే వివిధ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఈ ఫోన్ సెప్టెంబర్ 4న లాంచ్ కానుంది. అయితే భారతీయ వేరియంట్‌లో 8,340mAhకు బదులుగా మరింత భారీ 9,000mAh బ్యాటరీ అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.