POCO M8 Power 5G: పోకో (POCO) నుండి కొత్తగా వస్తున్న POCO M8 Power 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. కొద్దీ రోజుల క్రితం POCO M8s 5Gను విడుదల చేసిన కంపెనీ.. ఇప్పుడు M8 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకురానుంది. ఆగస్టు 4న ఈ ఫోన్ భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. “Power Your Binge” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్‌ను ఎక్కువసేపు వీడియోలు, సినిమాలు చూసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
భారీ బ్యాటరీ:
POCO M8 Power 5Gలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 8,000mAh భారీ బ్యాటరీ. కంపెనీ ప్రకారం ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్.
AMOLED డిస్‌ప్లే:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉండనున్నట్లు సమాచారం. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీక్షణ మరింత స్మూత్‌గా ఉండనుంది. AMOLED ప్యానెల్ కారణంగా మరింత ప్రకాశవంతమైన రంగులు, మెరుగైన విజువల్ అనుభవం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
AI కెమెరా:
టీజర్‌లో కనిపించిన డిజైన్ ప్రకారం.. ఫోన్ వెనుక భాగంలో ఆరెంజ్ టెక్స్చర్డ్ ఫినిష్ ఇవ్వనున్నారు. రౌండెడ్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు AI కెమెరా ఫీచర్లు, LED ఫ్లాష్ ఉండనున్నాయి. దీంతో ఫోటోగ్రఫీ అనుభవం మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
ప్రాసెసర్:
POCO M8 Power 5Gలో Qualcomm Snapdragon 4 Gen 4 చిప్‌సెట్ ఉండనుంది. ఈ ప్రాసెసర్ రోజువారీ పనులతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు కూడా మెరుగైన పనితీరును అందించే అవకాశం ఉంది. మొబైల్ విడుదల తర్వాత ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ధర, ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి పూర్తి వివరాలను కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది.
More Power, More Entertainment, More Binge.
Get ready for the #POCOM8Power. With a Massive 8000mAh Battery for up to 3 days of power and an Immersive AMOLED Display, so every stream, game and scroll feels uninterrupted.
Launching on 4th Aug | 12pm.#M8Power #PowerYourBinge pic.twitter.com/3ipbcWWjal
— POCO India (@IndiaPOCO) July 27, 2026

