Site icon NTV Telugu

Poco M8 5G: ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే!

Poco M8 5g

Poco M8 5g

Poco M8 5G: ఇండియాలో పోకో స్మార్ట్‌ఫోన్ M8 5G అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత వారం రిలీజ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ ధరలు, ఆఫర్లు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Supreme Court: కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదు.. జంతు ప్రేమికులకు సూటిప్రశ్న

Poco M8 5G ధర..
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. 8GB + 128GB వేరియంట్ ధర రూ.19,999 కు అందుబాటులో ఉంది. అలాగే 8GB + 256GB వేరియంట్ ధర రూ.21,999కు వస్తుంది. ఇది ఫ్రాస్ట్ సిల్వర్, గ్లేసియర్ బ్లూ, కార్బన్ బ్లాక్ రంగులలో దొరుకుతుంది. పోకో పరిమిత కాల లాంచ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీనితో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.15,999కి తగ్గింది. పోకో M8 5G ఇతర రెండు వేరియంట్‌ల ధర వరుసగా రూ.16,999, రూ.18,999గా ఉన్నాయి. ఈ ఆఫర్ జనవరి 13వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌లో రూ.1,000 లాంచ్ బెనిఫిట్ వస్తుంది. దీనికి అదనంగా HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ.2,000 తక్షణ క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు.

Poco M8 5G స్పెసిఫికేషన్లు ఇవే..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,392 పిక్సెల్స్), 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను 120 Hz రిఫ్రెష్ రేట్, 3,200 nits పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఇది Android 15 ఆధారంగా HyperOS 2.0పై పని చేస్తుంది. ఇది Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. Poco M8 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. దీని ముందు కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 20-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని కెమెరాలు 4K రిజల్యూషన్ వరకు వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు నాలుగు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, ఆరేళ్ల వారంటీ వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 5,520 mAh బ్యాటరీ, 45 W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 18 W వైర్డు రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

READ ALSO: US – Iran Tensions: ఇరాన్‌పై దాడికి అమెరికా ప్లాన్.. దాడి చేసేది ఇక్కడి నుంచే!

Exit mobile version