Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీ చెవికి “ఇయరింగ్”!.. ఇది సాధారణ రింగ్ కాదు..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒమన్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధాని స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, గౌరవ వందనం వంటి కార్యక్రమాలతో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అంశం ఆసక్తిని రేపింది. ఈ పర్యటనలో మోడీ ఎడమ చెవి పక్కన ఏదో కనిపించింది. ఇది ఒక చెవి ఆభరణంలాంటి వస్తువు. ఇది మోడీ కొత్త స్టైల్‌? అనే ప్రచారం మొదలైంది.

READ MORE: Bangladesh Violence: బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకి హత్య.. ఇంతకీ ఎవరీ ఉస్మాన్‌ హాదీ..?

వాస్తవానికి.. మోడీ దేశ పాలన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ.. తన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారన్న విషయం తెలిసిందే. ఆయన ధరించే కుట్టిన సూట్లు, ప్రకాశవంతమైన రంగులు దుస్తులు ఎప్పుడూ చర్చకు వస్తుంటాయి. ఒకసారి తన పేరుతో నేసిన బంధ్గాలా సూట్ హైలైట్ గా నిలిచింది. కానీ ఈసారి చెవిలో కనిపించిన “ఇయరింగ్” గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.. మోడీ చెవిలో కనిపించిన రింగ్ ఫ్యాషన్ కోసం కాదు. అది రియల్ టైమ్ అనువాద పరికరం అని తెలిసింది. అంతర్జాతీయ దౌత్య సమావేశాల్లో దీన్ని ఉపయోగిస్తారు. విమానాశ్రయంలో ఒమన్ ఉప ప్రధాని సయ్యిద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్‌ను కలిసిన సమయంలో మోడీ ఈ పరికరాన్ని ధరించారు. గల్ఫ్ దేశమైన ఒమన్ అధికార భాష అరబిక్. ఈ భాషను అర్థం చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ప్రధాని మోడీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో విభిన్న భాషలు ఉంటాయి. వివిధ దేశాధినేతలు కలిసినప్పుడు వాళ్లు మాట్లాడే మాటలు అర్థం చేసుకోవడానికి, ట్రాన్స్‌లేట్ చేయడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది.

READ MORE: Shocking Murder: రెంటర్స్ ని అద్దె అడిగేందుకు వెళ్లిన ఇంటి ఓనర్.. ఆ తర్వాత ఏమైందంటే..

Exit mobile version