Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!

  • సెకండ్ హ్యాండ్ గాడ్జెట్‌ల వైపు మొగ్గు
  • తక్కువ ధరకు వస్తోందని తొందరపడి కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు
  • స్క్రీన్, పోర్టులు, సెన్సార్లు తప్పనిసరిగా పరీక్షించండి
Smartphone Buying Guide

Smartphone Buying Guide

కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రిఫర్బిష్డ్ (Refurbished) లేదా సెకండ్ హ్యాండ్ గాడ్జెట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. సరైన హ్యాండ్ సెట్ ని ఎంపిక చేసుకుంటే కొత్త డివైస్‌తో పోలిస్తే 20 నుంచి 50 శాతం వరకు డబ్బు ఆదా చేయవచ్చు. అయితే, తక్కువ ధరకు వస్తోందని తొందరపడి కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

స్క్రీన్, పోర్టులు, సెన్సార్లు తప్పనిసరిగా పరీక్షించండి

సెకండ్ హ్యాండ్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు దాని బాహ్య రూపాన్ని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దు.

స్క్రీన్‌పై గీతలు లేదా డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా లేదా చూడండి.
ఛార్జింగ్ పోర్ట్ సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షించండి.
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కెమెరా, స్పీకర్, మైక్రోఫోన్, బటన్లు సక్రమంగా పనిచేస్తున్నాయో చూసుకోవాలి.
ల్యాప్‌టాప్ అయితే కనీసం 10-15 నిమిషాలు ఉపయోగించి పనితీరును పరిశీలించండి.

బ్యాటరీ హెల్త్‌ను నిర్లక్ష్యం చేయొద్దు

సెకండ్ హ్యాండ్ డివైస్‌లో ఎక్కువగా దెబ్బతినే భాగం బ్యాటరీ. అందుకే కొనుగోలు చేసే ముందు బ్యాటరీ హెల్త్, ఛార్జింగ్ సైకిల్స్, బ్యాటరీ బ్యాకప్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి. అవసరమైతే డివైస్ సెట్టింగ్స్ లేదా డయాగ్నస్టిక్ యాప్‌ల ద్వారా బ్యాటరీ స్థితిని తెలుసుకోవచ్చు.

నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌ల నుంచే కొనండి

సెకండ్ హ్యాండ్ గాడ్జెట్‌లు కొనుగోలు చేసేటప్పుడు విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకోవడం మంచిది.

Cashify – భారతదేశంలో ప్రముఖ రీ-కామర్స్ ప్లాట్‌ఫామ్. 200కు పైగా ఆఫ్‌లైన్ స్టోర్లతో సేవలు అందిస్తోంది.
Amazon Renewed – నిపుణులచే పరీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పూర్తి చేసిన రిఫర్బిష్డ్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంటాయి.
Flipkart Refurbished – సర్టిఫైడ్ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై 3 నుంచి 12 నెలల వరకు వారంటీ అందిస్తుంది.

కొనుగోలు ముందు ఈ విషయాలు కూడా గుర్తుంచుకోండి

IMEI నంబర్‌ను ధృవీకరించండి.
బిల్, వారంటీ లేదా కొనుగోలు రసీదు ఉంటే పరిశీలించండి.
డివైస్‌లో ఎలాంటి అకౌంట్ లాక్ (iCloud/Google Lock) లేదని నిర్ధారించుకోండి.
సాధ్యమైనంత వరకు వారంటీ లేదా రిటర్న్ పాలసీ ఉన్న పరికరాలనే కొనుగోలు చేయండి.
తక్కువ ధరకు మంచి డివైస్ కొనడం తెలివైన నిర్ణయమే. అయితే కొనుగోలు ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తేనే మీ డబ్బుకు పూర్తి విలువ లభిస్తుంది.