64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?

  • ఫిలిప్స్ కొత్త S7221 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల
  • 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్
  • 64MP ఆటోఫోకస్ మెయిన్ కెమెరా..
Philips S7221 5g

Philips S7221 5g

Philips S7221 5G: ఫిలిప్స్ (Philips) స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. తాజాగా ఫిలిప్స్ S7221 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గతంలో వచ్చిన S7220 5Gకి కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త ఫోన్‌లో ప్రీమియం డిజైన్‌తో పాటు అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లను అందించారు. ముఖ్యంగా 64MP కెమెరా, కొత్త 5G ప్రాసెసర్, పెద్ద డిస్‌ప్లే, 5,700mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

డిస్‌ప్లే:

ఫిలిప్స్ S7221 5Gలో 6.67 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. అయితే రిఫ్రెష్ రేట్ 60Hzకే పరిమితం చేశారు. ఫోన్ ముందు భాగంలో పెద్ద డిస్‌ప్లే ఉండగా.. వెనుక భాగంలో స్క్వేర్ ఆకారంలోని కెమెరా మాడ్యూల్‌ను అందించారు. గత మోడల్‌తో పోలిస్తే కొత్త S7221 5Gకు మరింత ప్రీమియం ఫినిష్ ఇచ్చారు. వెనుక భాగంలో ప్రధాన కెమెరాతో పాటు మరో సహాయక లెన్స్‌ను స్క్వేర్ మాడ్యూల్‌లో అమర్చారు.

కెమెరా & ప్రాసెసర్:

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 64MP ఆటోఫోకస్ కెమెరాను అందించారు. ఈ కెమెరాకు f/1.179 అపెర్చర్ ఉన్నట్లు సమాచారం. కెమెరా మాడ్యూల్‌లో ప్రత్యేకమైన వృత్తాకార ఫ్లాష్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు Unisoc T8200 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ పవర్ అందిస్తుంది. TSMC 6nm ప్రాసెస్‌పై రూపొందిన ఈ చిప్‌సెట్ బడ్జెట్ విభాగంలో మంచి పనితీరును అందించేలా రూపొందించారు. N1, N3, N28, N41, N77, N78 వంటి పలు 5G బ్యాండ్లకు ఇది సపోర్ట్ చేస్తుంది.

బెంచ్‌మార్క్ వివరాల ప్రకారం Unisoc T8200 AnTuTu 11లో సుమారు 7,57,199 పాయింట్లను సాధించినట్లు సమాచారం. Geekbench 6లో సింగిల్-కోర్ టెస్ట్‌లో 885 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 2,392 పాయింట్లు, GPU టెస్ట్‌లో 2,236 పాయింట్లు సాధించినట్లు తెలుస్తోంది.

బ్యాటరీ:

ఈ కొత్త మొబైల్ లో 5,700mAh బ్యాటరీను అందించారు. దీనికి 9V/2A స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే USB Type-C పోర్ట్ అందించారు. అయితే ప్రత్యేకమైన 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇందులో లేదు. Philips S7221 5G మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సిల్వర్/టైటానియం గ్రే, డార్క్ బ్లూ/నేవీ, బ్లాక్ కలర్ వేరియంట్లు ఉన్నాయి.

ధర ఎంత?

ప్రస్తుతం Philips S7221 5G ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. గతంలో విడుదలైన Philips S7220 ధర సుమారు రూ.15,000గా ఉంది. దీంతో కొత్త S7221 5G ధర కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉండనుంది. అయితే అధికారిక ధరపై ఇంకా స్పష్టత లేదు.