Site icon NTV Telugu

Viral Video: 32 జీబీ ఫోన్‌ విత్‌ 31.9 డేటా. ఈ ఓవర్‌ లోడ్‌ స్కూటర్‌ వీడియో చూశారా?

Viral Video

Viral Video

ఓ యువకుడు తన స్కూటర్‌ని 99.99 శాతం గూడ్స్‌తో నింపేసి, పాయింట్‌ వన్‌ పర్సెంట్‌ సీటు మీద మాత్రమే తాను కూర్చొని, ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవింగ్‌ చేస్తున్న ఓ వీడియోని చూశారా?. దానికి ఒక నెటిజన్‌ పెట్టిన క్యాప్షన్‌ కూడా చదివితీరాల్సిందే. ఈ స్కూటర్‌ని చూస్తుంటే 32 జీబీల మెమొరీ కలిగిన తన మొబైల్‌ ఫోన్‌లో 31.9 శాతం డేటా ఫుల్‌ అయినట్లుగా ఉందనే ఫన్నీ కామెంట్‌ పెట్టాడు. అయితే ఈ పోస్టు తెలంగాణ పోలీసు విభాగం దృష్టికి రావటంతో వాళ్లు రీట్వీట్‌ చేశారు. అదే సమయంలో వాహనదారులకు ఒక విలువైన సలహా కూడా ఇచ్చారు.

‘మొబైల్‌లో డేటా పోతే తిరిగి తెచ్చుకోవచ్చు. ఫోన్‌ డ్యామేజ్‌ అయినా ఇది సాధ్యమే. కానీ.. లైఫ్‌ ఒక్కసారి లాసైతే మళ్లీ పొందలేం. కాబట్టి ప్రజలు తమ ప్రాణాలకు తెగించి ప్రమాదకరంగా ప్రవర్తించొద్దు. ఇదే మా హృదయపూర్వక మనవి’ అని ముగించారు. మొత్తానికి ఈ వీడియోని ఎక్కడ చిత్రీకరించారో తెలియదు గానీ ప్రత్యక్షంగా చూస్తే ఆసక్తికరంగా, పరోక్షంగా పరిశీలిస్తే సందేశాత్మకంగానూ ఉందని ‘సోషల్‌’ సిటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version