Site icon NTV Telugu

కొత్త ‘క్రిస్టల్ పింక్’ కలర్‌లో OPPO Reno15 Pro Mini లాంచ్.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!

Oppo Reno15 Pro Mini Crystal Pink

Oppo Reno15 Pro Mini Crystal Pink

OPPO Reno15 Pro Mini: ఒప్పో (OPPO) సంబంధించి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రెనో 15 ప్రో మినీ (Reno15 Pro Mini)ని భారత్‌లో కొత్తగా ‘క్రిస్టల్ పింక్’ (Crystal Pink) కలర్ వేరియంట్‌ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఈ నెల ప్రారంభంలోనే కోకో బ్రౌన్, గ్లేసియర్ వైట్ రంగుల్లో విడుదల చేసిన ఒప్పో ఇప్పుడు స్టైలిష్ క్రిస్టల్ పింక్ రంగుతో మరింత ఆకర్షణీయంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఒప్పో రెనో 15 ప్రో మినీ స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే:
* 6.32 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లే (2640 × 1216 పిక్సెల్స్),
* 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్,
* గరిష్టంగా 3600 నిట్స్ బ్రైట్‌నెస్,
* 3840Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్,
* ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్.

Greatest T20 Team: 11 మంది మ్యాచ్ విన్నర్స్.. టీ20 వరల్డ్‌కప్‌కు భారత గ్రేటెస్ట్ టీ20 టీమ్ సిద్ధం!

ప్రాసెసర్:
* 4nm టెక్నాలజీపై ఆధారిత MediaTek Dimensity 8450 ఆక్టా-కోర్ ప్రాసెసర్.
* (గరిష్టంగా 3.25GHz), Mali-G720 MC7 GPU.

మెమరీ & స్టోరేజ్:
* 12GB LPDDR5X ర్యామ్,
* 256GB / 512GB UFS 3.1 స్టోరేజ్.
* ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16

కెమెరా విభాగం:
ఫోటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ మంచి ఆప్షన్‌గా నిలవనుంది. రియర్ కెమెరాలు:
* 200MP మెయిన్ కెమెరా (OIS, f/1.8),
* 50MP అల్ట్రా వైడ్ కెమెరా (112° FOV),
* 50MP 3.5X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OIS),
* 4K 60fps వీడియో రికార్డింగ్.
ఫ్రంట్ కెమెరా:
* 50MP సెల్ఫీ కెమెరా, 4K 60fps వీడియో సపోర్ట్.

Nirmala Sitharaman Saree: బడ్జెట్‌ వేళ నిర్మలా సీతారామన్‌ స్పెషల్‌ చీర.. ప్రత్యేకలు ఏంటో తెలుసుకుందాం..?

ఇతర ఫీచర్లు:
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్,
* ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్,
* స్టీరియో స్పీకర్లు, USB టైప్-C ఆడియో,
* IP66 + IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్.

కనెక్టివిటీ & బ్యాటరీ:
* 5G SA / NSA, డ్యూయల్ 4G VoLTE
*Wi-Fi 6, Bluetooth 5.4, GPS, GLONASS, Galileo
* 6200mAh బ్యాటరీ.
* 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్.

ధర & లభ్యత:
ఒప్పో రెనో15 ప్రో మినీ కొత్త క్రిస్టల్ పింక్ వేరియంట్ ఫిబ్రవరి 1, 2026 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, OPPO ఈ-స్టోర్, అలాగే ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
* 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్: రూ. 59,999.
* 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్: రూ. 64,999.

Union Budget 2026: క్యాపెక్స్, అప్పులు, పన్నులు.. బడ్జెట్‌లో మనం గమనించాల్సిన కీలక పాయింట్స్ ఇవే..

లాంచ్ ఆఫర్లు:
కస్టమర్ల కోసం OPPO ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, UPI ద్వారా 10% వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. 15 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ EMI ఆప్షన్, ఇంకా రూ.2,000 ఎక్స్చేంజ్ బోనస్, 180 రోజుల ఫ్రీ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ప్రతి కొనుగోలుపై ఒప్పో ఇంకో బడ్స్ 3 Pro+పై 50% డిస్కౌంట్ వస్తుంది.

Exit mobile version