Site icon NTV Telugu

IP66+IP68+IP69 రేటింగ్స్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో Oppo Reno 14F 5G Star Wars Edition లాంచ్కు సర్వం సిద్ధం..!

Oppo Reno 14f 5g Star Wars Edition

Oppo Reno 14f 5g Star Wars Edition

Oppo Reno 14F 5G Star Wars Edition: స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) సంస్థ తన కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ Oppo Reno 14F 5G Star Wars Editionను నవంబర్ 15న మెక్సికోలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక ఎడిషన్ జూన్ 2025లో విడుదలైన Oppo Reno 14F 5G ఆధారంగా రూపొందించబడింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన స్టార్ వార్స్ థీమ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో డార్త్ వేడర్ (Darth Vader) చిత్రాన్ని ఉంచారు. అలాగే బాక్స్‌లో డార్త్ వేడర్ థీమ్ సిమ్ ఎజెక్టర్ టూల్, డెత్ స్టార్ II ఫోన్ స్టాండ్ కూడా అందించబడతాయి. ఇది “ఎక్స్‌క్లూజివ్ లిమిటెడ్ ఎడిషన్ కలెక్టర్స్ బాక్స్”లో వస్తుంది. ప్రతి యూనిట్‌పై ప్రత్యేకమైన కలెక్షన్ కోడ్ కూడా ఉండబోతోంది.

Islamabad Blast: ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు.. ఎంత మంది చనిపోయారంటే..

Oppo Reno 14F 5G Star Wars Edition ఫోన్ డిజైన్ పరంగా సాధారణ వెర్షన్‌తో పోలిస్తే కొన్ని మార్పులు మాత్రమే ఉంటుంది. ఇందులోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అదే విధంగా కొనసాగించబడింది. Reno 14F 5G లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అందించారు. సాధారణ Reno 14F 5G మోడల్‌లో 6.57 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్కామ్ Snapdragon 6 Gen 1 చిప్‌సెట్, Adreno A710 GPU, గరిష్టంగా 12GB LPDDR4X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజ్ ఉంటాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6,000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే IP66 + IP68 + IP69 రేటింగ్స్ తో నీటి, దూళి నిరోధకత కూడా కల్పించారు.

Peddhi : ‘చికిరి చికిరి’ సాంగ్‌.. రామ్ చరణ్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Oppo Reno 14F 5G బేస్ వేరియంట్ 8GB + 256GB తైవాన్‌లో NTD 14,300 (రూ. 41,800) ధరలో ఉంది. ఇక స్టార్ వార్స్ ఎడిషన్ మాత్రం ప్రత్యేకమైన ప్యాకేజింగ్, థీమ్ కారణంగా కొంచెం ఎక్కువ ధరలో విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద స్టార్ వార్స్ అభిమానులకు ఇది ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ఐటమ్‌గా నిలవనుంది. ఆకర్షణీయమైన డిజైన్, పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు, కలెక్టర్స్ ఎడిషన్ బాక్స్‌తో Oppo Reno 14F 5G Star Wars Edition నవంబర్ 15న మెక్సికో మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించబడుతుంది.

Exit mobile version