ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇటీవల కాలంలో కెమెరా కోసం కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తమ జ్ఞాపకాలను ఫోన్‌లో పదిలం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కెమెరా పరంగా అప్పో ఫోన్లు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే తాజాగా ఒప్పో రెనో 11 ప్రో మొబైల్ గురించి అప్డేట్ ను అందించింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ ఫోన్‌ను భారతదేశంలో జనవరి 12, 2024న విడుదల చేస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడో పేర్కొంది. భారతదేశంలో రెనో 11 సిరీస్‌ను ఫస్ట్ లుక్‌తో పాటు లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఇప్పటికి లాంచ్ చెయ్యడం విశేషం.. ఈ ఫోన్ 32 ఎంపీ టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే బ్రాండ్ న్యూ కలర్ ఓఎస్ 14తో పని చేస్తుంది. ప్రామాణిక మోడల్ 67 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే ప్రో మోడల్ 80 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో వస్తుంది..
ఈ ఫోన్ ను చైనాలో నవంబర్ లో విడుదల చేసింది.. పెరల్ వైట్, రాక్ గ్రే కలర్ ఆప్షన్‌లలో వస్తున్న ఈ డివైజ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్రాగొంటల్ 2 గ్లాస్ ప్రొటెక్షన్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ 8200 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ప్రో మోడల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 32 ఎంపీ టెలిఫోటో సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. Oppo ప్రపంచంలోనే ఫస్ట్ హైపర్‌టోన్ కెమెరాతో ఫోన్‌ను మార్కెట్ లోకి వదిలినట్లు ప్రకటించింది.. ఇక ధర విషయానికొస్తే.. రూ.39,999 గా ఫ్లిప్ కార్టులో ప్రకటించారు. దీనిపై రూ.5 వేల డిస్కౌంట్ కూడా ప్రకటించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ స్టోర్స్ లలో అందుబాటులో ఉన్నాయి.. ఈ ఫోన్లు లాంచ్ కు ముందే ఫ్రీ సేల్స్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది..
