Site icon NTV Telugu

కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

Oppo Pad Mini

Oppo Pad Mini

OPPO Pad Mini Launch: ఒప్పో నుండి కొత్తగా చైనాలో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో ఒప్పో ప్యాడ్ మినీ (OPPO Pad Mini)ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ టాబ్లెట్‌ను OPPO Find X9 సిరీస్ ఫోన్లతో పాటు లాంచ్ చేశారు. కాంపాక్ట్ సైజ్, హైఎండ్ ఫీచర్లతో ఈ డివైస్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.

స్లిమ్ డిజైన్, డిస్‌ప్లే:
ఒప్పో ప్యాడ్ మినీ చాలా తేలికగా, స్లిమ్‌గా ఉంటుంది. దీని బరువు కేవలం 279 గ్రాములు కాగా, మందం 5.39mm మాత్రమే. స్పేస్ గ్రే, మింట్ గ్రీన్, మోనెట్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ టాబ్లెట్‌లో 8.8 అంగుళాల 2.5K OLED డిస్‌ప్లేను అందించారు. 144Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. 2.99mm అల్ట్రా నారో బెజెల్స్‌తో స్క్రీన్-టు-బాడీ రేషియో కూడా ఆకట్టుకునేలా ఉంది.

144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

పవర్‌ఫుల్ ప్రాసెసర్, బ్యాటరీ:
OPPO ప్యాడ్ మినీలో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm టెక్నాలజీతో రూపొందించబడిన హైఎండ్ చిప్‌సెట్. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. ఇందులో 8000mAh బ్యాటరీ ఉండగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్లు:
ఈ టాబ్లెట్‌లో కనెక్టివిటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఒప్పో స్మార్ట్‌ఫోన్ దగ్గర ఉంటే ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ షేర్ అవుతుంది. డ్యూయల్ 5G నెట్‌వర్క్ షేరింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్, ఆపిల్ ఎకోసిస్టమ్‌ల మధ్య ఫైల్ ట్రాన్స్‌ఫర్, మెసేజ్ సింక్, ఒకేసారి పలువురు హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేసుకునే అవకాశం కలదు.

స్టైలస్, యాక్సెసరీలు:
ఒప్పో AI స్టైలస్ సపోర్ట్ కూడా ఈ టాబ్లెట్‌లో ఉంది. రియలిస్టిక్ వైబ్రేషన్ ఫీడ్‌ బ్యాక్‌ తో పాటు AI డ్రాయింగ్, చార్ట్ క్రియేషన్, రింగ్‌టోన్ సెర్చ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Shloka Mehta: ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్‌సిటీ.. వీడియో వైరల్

కెమెరా, ఇతర ఫీచర్లు:
13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, Wi-Fi 7, Bluetooth 6.0, USB Type-C సపోర్ట్ కలిగి ఉంది.

ధర, లభ్యత:
చైనాలో ఒప్పో ప్యాడ్ మినీ ధరలు ఇలా ఉన్నాయి:
* 8GB + 256GB – రూ. 50,700
* 12GB + 256GB – రూ.54,815
* 12GB + 512GB – రూ.61,670 నుంచి రూ.68,530 వరకు (వేరియంట్స్ ఆధారంగా)
ఈ టాబ్లెట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఏప్రిల్ 30 నుంచి చైనాలో సేల్ ప్రారంభం కానుంది.

Exit mobile version