Oppo Pad 6: డైమెన్సిటీ 9500s, 10420mAh బ్యాటరీతో.. ఒప్పో ప్యాడ్ 6 విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO చైనాలో కొత్త Oppo Pad 6 టాబ్లెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో వచ్చిన ప్యాడ్ 5కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ కొత్త టాబ్లెట్, మెరుగైన డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో ఆకట్టుకుంటోంది. ఒప్పో ప్యాడ్ 6లో 12.1 అంగుళాల LCD డిస్ప్లేను అందించారు. ఈ ప్యానెల్ 3000 × 2120 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 540Hz టచ్ శాంప్లింగ్ రేట్ వల్ల స్క్రీన్ స్పందన మరింత వేగంగా ఉంటుంది.
ఈ డిస్ప్లే 900 నిట్స్ వరకు బ్రైట్నెస్ను అందించడంతో పాటు దాదాపు పూర్తి DCI-P3 కలర్ గామట్‌ను కవర్ చేస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, డ్రాయింగ్ వంటి పనుల్లో ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
Also Read
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
డైమెన్సిటీ 9500s ప్రాసెసర్
పనితీరు కోసం టాబ్లెట్‌లో మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి ఆర్మ్ Mali-G615 MC2 GPU జత చేశారు. ఈ టాబ్లెట్‌ను గరిష్టంగా 16GB LPDDR5x RAM, 512GB UFS 3.1 స్టోరేజ్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్OS 16పై పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్, AI ఆధారిత పనుల్లో వేగవంతమైన పనితీరును అందించగలదని కంపెనీ పేర్కొంది.
కెమెరాలు, కనెక్టివిటీ
ఫోటోగ్రఫీ కోసం ముందు, వెనుక భాగాల్లో 8MP కెమెరాలను అందించారు. ఈ రెండు కెమెరాలు కూడా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. కనెక్టివిటీ పరంగా Wi-Fi 7, బ్లూటూత్ 5.4, USB Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్ వంటి సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్
ఒప్పో ప్యాడ్ 6లో 10,420mAh భారీ బ్యాటరీని అందించారు. దీన్ని 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ టాబ్లెట్ కేవలం 5.99mm మందంతో, 579 గ్రాముల బరువుతో సన్నని డిజైన్‌ను కలిగి ఉంది.
ఒప్పో ప్యాడ్ 6 ధరలు
స్టాండర్డ్ వేరియంట్లు
8GB RAM + 256GB స్టోరేజ్ – CNY 3,499 (సుమారు రూ.49,000)
12GB RAM + 512GB స్టోరేజ్ – CNY 3,899 (సుమారు రూ.54,700)
16GB RAM + 512GB స్టోరేజ్ – CNY 4,299 (సుమారు రూ.60,300)
సాఫ్ట్ లైట్ ఎడిషన్
8GB RAM + 256GB స్టోరేజ్ – CNY 3,799 (సుమారు రూ.53,200)
12GB RAM + 256GB స్టోరేజ్ – CNY 4,199 (సుమారు రూ.58,900)
స్టాండర్డ్ మోడళ్లు డీప్ స్పేస్ గ్రే, గెలాక్సీ సిల్వర్ కలర్స్ లో అందుబాటులో ఉంటాయి. సాఫ్ట్ లైట్ ఎడిషన్‌కు అదనంగా స్టార్‌లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది.
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?