ఒప్పో తన బడ్జెట్-ఫ్రెండ్లీ K సిరీస్ లో మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Oppo K15 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్ భారీ 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, శక్తివంతమైన MediaTek Dimensity 7360 ప్రాసెసర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో Oppo K15 Pro, Oppo K15 Pro+ మోడళ్లను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు మూడో మోడల్‌గా Oppo K15 5Gను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.
Oppo K15 5G ధర
Oppo K15 5G ప్రస్తుతం ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్ – CNY 2,299 (సుమారు రూ. 33,000). ఈ స్మార్ట్‌ఫోన్ Gale Gray, Rapid White అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. త్వరలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
డిస్‌ప్లే
Oppo K15 5Gలో 6.59 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 1256 × 2760 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించారు. దీంతో వీడియోలు, గేమింగ్, మల్టీమీడియా అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.
పవర్‌ఫుల్ ప్రాసెసర్
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7360 చిప్‌సెట్‌ను ఉపయోగించారు.
ఇతర స్పెసిఫికేషన్స్:
12GB RAM
256GB ఇంటర్నల్ స్టోరేజ్
భారీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్
Tidal Engine థర్మల్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ
గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేక కూలింగ్ వ్యవస్థను అందించారు.
50MP కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ కోసం Oppo K15 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలు.. 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్), 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10x డిజిటల్ జూమ్. ఫ్రంట్ కెమెరా.. 50MP సెల్ఫీ కెమెరా, అధిక రిజల్యూషన్‌తో సెల్ఫీలు, వీడియో కాల్స్, ఫోటోగ్రఫీకి ఈ కెమెరా ఉపయోగపడుతుంది.
8000mAh బ్యాటరీ
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 8000mAh భారీ బ్యాటరీ. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ సపోర్ట్ అందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వినియోగించుకునేలా రూపొందించారు.
ఇతర ఫీచర్లు
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
Android 16 ఆధారిత ColorOS 16
Wi-Fi
Bluetooth
5G కనెక్టివిటీ

