200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!

  • OPPO Find X10 Pro Max గ్లోబల్ మార్కెట్లలో లాంచ్.
  • మూడు 200MP కెమెరాలతో ప్రత్యేక కెమెరా సెటప్.
  • 6.78 అంగుళాల 144Hz LTPO AMOLED డిస్‌ప్లే.
  • 2nm MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్.
  • 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ.
  • 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
  • IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్..
Oppo Find X10 Pro Max

Oppo Find X10 Pro Max

OPPO Find X10 Pro Max Launched: ఒప్పో (OPPO) నుండి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫైండ్ X10 ప్రో మాక్స్ ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల అయ్యింది. హాసెల్‌బ్లాడ్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ ఫోన్‌లో మూడు 200MP కెమెరాలతో ప్రత్యేక కెమెరా సెటప్‌ను అందించారు. దీంతోపాటు 144Hz LTPO AMOLED డిస్‌ప్లే, 2nm ప్రాసెసర్, 8000mAh బ్యాటరీ, ColorOS 17 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

200MP కెమెరాలు

ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్లో ప్రధాన కెమెరా, అల్ట్రా-వైడ్, టెలిఫోటో.. మూడు కెమెరాలు 200MP రిజల్యూషన్‌తో రావడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. ప్రధాన కెమెరాలో f/1.5 అపెర్చర్, OIS ఉన్నాయి. 124 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 200MP అల్ట్రా-వైడ్ కెమెరా, 200MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 10cm వరకు మినిమమ్ ఫోకస్ దూరంతో మాక్రో ఫొటోగ్రఫీకి సపోర్ట్ చేస్తుంది. వీటికి తోడుగా 3.28x హాసెల్‌బ్లాడ్ ఆప్టికల్ టెలికన్వర్టర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. హాసెల్‌బ్లాడ్ పోర్ట్రెయిట్ ఫీచర్, 120x వరకు డిజిటల్ జూమ్ కూడా అందించారు. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరా ప్రాసెసింగ్ కోసం LUMO True Image Engine, True Color Camera టెక్నాలజీలను ఉపయోగించారు. సాధారణంగా కనిపించే ఓవర్-షార్పెనింగ్, అతిగా HDR ప్రాసెసింగ్‌ను తగ్గించి సహజమైన ఫొటోలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఒప్పో తెలిపింది.

Find X10 Pro Maxలో మూడు వెనుక కెమెరాలతో 4K 120fps, 8K 30fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది. Dolby Vision, ACES సర్టిఫైడ్ O-Log2, Open Gate Capture వంటి ప్రొఫెషనల్ వీడియో ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒప్పో ఈ ఫీచర్లను “బ్లాక్ మ్యాజిక్ కెమెరా” యాప్‌తో కూడా అనుసంధానించింది. వీడియో షూటింగ్ సమయంలో అదనపు సౌకర్యాల కోసం 67mm ఫిల్టర్ రింగ్, యాక్సెసరీ మౌంటింగ్, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో కూడిన “టిల్ట ఖ్రోనోస్ క్రియేటర్ కిట్” కూడా అందుబాటులోకి రానుంది.

144Hz డిస్‌ప్లే

కొత్త ఫోన్‌లో 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. 2772×1272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 3,840Hz అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, HDR10+, Dolby Vision, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. అలాగే ఇందులో పనితీరు కోసం 2nm MediaTek Dimensity 9600 ప్రో ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి Mali-G2-Ultra-NX GPU జతగా ఉంటుంది. 12GB లేదా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ అందించారు.

8000mAh బ్యాటరీ

ఈ ఫ్లాగ్‌షిప్‌లో 8000mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 80W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందించారు. ఫోన్ IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత ColorOS 17పై పనిచేస్తుంది. ఇందులో AI మైండ్ పైలట్, AI ఫోటో ఏజెంట్, AI కాల్ గార్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. AI మైండ్ పైలట్ సహజ భాష ఆధారంగా ఫైల్స్, వెబ్ డేటా, ఇతర ప్రొడక్టివిటీ పనులను నిర్వహించడంలో సహాయపడుతుంది. AI ఫోటో ఏజెంట్ ద్వారా ప్రాంప్ట్ ఆధారిత ఫొటో ఎడిటింగ్, స్టైల్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్లు పొందవచ్చు. AI కాల్ గార్డ్ సింథటిక్ ఆడియో, ఫేస్ మానిప్యులేషన్ ఆధారిత మోసాలను గుర్తించేందుకు రూపొందించారు.

ధర

ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ Titanium Grey, డ్యూయల్-టోన్ Luna White రంగుల్లో లభిస్తుంది. 12GB + 512GB వేరియంట్ ధర €1,799 (సుమారు రూ.1,90,660)గా నిర్ణయించారు. గ్లోబల్ మార్కెట్లలో ఒప్పో అధికారిక ఛానళ్లు, భాగస్వామ్య క్యారియర్లు, అధీకృత రిటైలర్ల ద్వారా అక్టోబర్ చివరి నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.