Site icon NTV Telugu

200MP హై-రెజల్యూషన్ కెమెరా, 6,000mAh డ్యూయల్ బ్యాటరీ సెటప్తో Oppo Find N6

Oppo 1

Oppo 1

Oppo Find N6: ఒప్పో సంస్థ తమ పాపులర్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Oppo Find N6ను అభివృద్ధి చేస్తోందనే వార్తలు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. Oppo Find N6లో డిస్‌ప్లే ఫీచర్లతో పాటు శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది.

Read Also: The Health Risks of Overeating: అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

డిస్‌ప్లే ఫీచర్లు
* 8.12 అంగుళాల LTPO UTG ఇన్నర్ డిస్‌ప్లే..
* 2K రిజల్యూషన్ సపోర్ట్..
* బయట వైపు 6.62 అంగుళాల కవర్ స్క్రీన్..
* ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ఒరిజినల్ టైటానియం, డీప్ బ్లాక్, గోల్డెన్ ఆరెంజ్ రంగుల్లో విడుదల కావొచ్చని సమాచారం.
* ఫోన్ బరువు సుమారు 225 గ్రాములుగా ఉండనుంది.

Read Also: DGP Shivadhar Reddy: రాష్ట్రంలో భారీగా పెరిగిన నమ్మక ద్రోహం కేసులు..

కెమెరా సెటప్
* 50MP ప్రైమరీ కెమెరా
* 50MP సెకండరీ సెన్సార్
* 200MP హై-రిజల్యూషన్ కెమెరాతో పాటు అదనంగా 2MP మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్ కూడా ఉండొచ్చని రూమర్స్. ఇది ఫోటోలలో కలర్ అక్యూరసీ, వైట్ బ్యాలెన్స్, ఇమేజ్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది.

ప్రాసెసర్ & మెమరీ
* ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్
* 12GB RAM (గరిష్ఠంగా 16GB RAM వేరియంట్)
* 1TB వరకు స్టోరేజ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే, Beidou శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్‌తో ప్రత్యేక వేరియంట్‌ను కూడా Oppo తీసుకురావచ్చని సమాచారం.

బ్యాటరీ & ఛార్జింగ్
* Oppo Find N6లో డ్యూయల్ బ్యాటరీ సెటప్ ఉండే అవకాశం ఉంది:
* 2,700mAh + 3,150mAh బ్యాటరీలు
* మొత్తం కెపాసిటీ 5,850mAh, మార్కెటింగ్ పరంగా 6,000mAhగా ప్రకటించే అవకాశం.

లాంచ్ ఎప్పుడు?
Oppo Find N6ను 2026 జనవరిలో లేదా కొత్త ఏడాది మొదటి త్రైమాసికంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక, అధికారిక ప్రకటన కోసం టెక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ విడుదల అయితే, ప్రీమియం ఫోల్డబుల్ మార్కెట్‌లో Oppo Find N6 గట్టి పోటీ ఇవ్వనుంది.

 

 

Exit mobile version