Site icon NTV Telugu

55dB ANC, 54 గంటల బ్యాటరీ, సూపర్ ఫీచర్లతో Oppo Enco Air 5 Pro లాంచ్..!

Oppo Enco Air 5 Pro

Oppo Enco Air 5 Pro

OPPO Enco Air 5 Pro Launched: ఒప్పో (OPPO) నుండి క్రొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ (TWS)లు ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ప్రో (Oppo Enco Air 5 Pro)ను చైనాలో లాంచ్ చేసింది. ఇదివరకు ఉన్న Enco Air 4 Proకి కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త మోడల్ మెరుగైన ఆడియో క్వాలిటీ, పవర్‌ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్‌తో అప్గ్రేడ్స్ ను అందుకుంది. ముఖ్యంగా 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, LHDC 5.0 Hi-Res ఆడియో సపోర్ట్ వంటి ఫీచర్లు దీనిని ప్రీమియం సెగ్మెంట్‌లో నిలబెడుతున్నాయి.

హై క్వాలిటీ ఆడియో:
ఈ ఇయర్‌ బడ్స్ లలో 12mm డైనమిక్ డ్రైవర్ ఇవ్వబడింది. ఇది 20Hz నుంచి 40KHz వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్‌ను సపోర్ట్ చేస్తుంది. LHDC 5.0, AAC, SBC వంటి ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఉండటం వల్ల హై-రెజల్యూషన్ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. 1Mbps వరకు వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ స్పీడ్ ఉండటం వల్ల క్లియర్, డీటైల్‌డ్ సౌండ్‌ను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.

HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్:
ఈ ఇయర్‌ బడ్‌ లలో గరిష్టంగా 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ ఉంది. వినియోగదారులు ANC ఆన్, అడాప్టివ్ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్, ANC ఆఫ్ వంటి మోడ్‌ లను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అలాగే మూడు మైక్రోఫోన్‌ లతో కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండటం వల్ల కాల్స్ సమయంలో క్లియర్ వాయిస్ వినిపిస్తుంది.

కనెక్టివిటీ ఫీచర్స్:
ఈ ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ 6.0 కనెక్టివిటీతో వస్తాయి. డ్యూయల్ డివైస్ కనెక్షన్ సపోర్ట్ ఉండటం వల్ల ఒకేసారి రెండు డివైస్‌ లతో కనెక్ట్ చేయవచ్చు. 47ms లో లాటెన్సీ మోడ్ ఉండటం వల్ల గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సమయంలో ల్యాగ్ తగ్గుతుంది. టచ్ కంట్రోల్స్‌ తో పాటు వాల్యూమ్ అడ్జస్ట్ చేయడానికి స్లైడ్ జెస్చర్ సపోర్ట్ కూడా ఉంది.

బ్యాటరీ లైఫ్:
ప్రతి ఇయర్‌బడ్లో 62mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేసులో 530mAh బ్యాటరీ ఇవ్వబడింది. ANC ఆన్‌లో ఒకసారి ఛార్జ్ చేస్తే 7 గంటల వరకు, ANC ఆఫ్‌లో 13 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి ANC ఆన్‌లో 29 గంటలు, ANC ఆఫ్‌లో గరిష్టంగా 54 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందుతుంది.

Mother kill Child: తల్లివా.. రాక్షసివా..? రెండు నెలల చిన్నారిని కట్టెల పోయిలో వేసి..!

ధర:
ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ప్రో ధర చైనాలో CNY 329 (రూ. 4,300)గా నిర్ణయించారు. మూన్ స్టోన్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, మార్చి 2 నుంచి అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version