Site icon NTV Telugu

IP69 రేటింగ్‌, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో Oppo A6 Pro 4G లాంచ్.. ధర ఎంతంటే?

Oppo A6 Pro

Oppo A6 Pro

Oppo A6 Pro 4G: ఒప్పో A6 ప్రో 4G (Oppo A6 Pro 4G) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తాజాగా వియత్నాంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ Oppo A6 సిరీస్‌లో భాగంగా విడుదలైంది. దీనిలో ఇప్పటికే Oppo A6 ప్రో 5G, Oppo A6 GT, Oppo A6i వంటి 5G మోడల్‌లు ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన Oppo A6 ప్రో 4G స్మార్ట్‌ఫోన్. ఇందులో 7,000mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP కెమెరా, ముందు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే, ఇది నీటి, ధూళి నిరోధకత కోసం IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.

వియత్నాంలో Oppo A6 ప్రో 4G ధర VND 8,290,000 (రూ. 27,900)గా ఉంది. ఇది 8GB + 256GB వేరియంట్ మోడల్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ కోరల్ పింక్, లూనార్ టైటానియం, రోస్‌వుడ్ రెడ్, స్టెల్లార్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంటుంది. మరి ఈ Oppo A6 Pro 4G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను పూర్తిగా తెలుసుకుందామా..

IND vs BAN: భారత్ దూకుడుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేయగలదా..? నేడే బంగ్లాదేశ్‌, భారత్ సూపర్ 4 మ్యాచ్

డిస్‌ప్లే:
Oppo A6 ప్రో 4G స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల ఫుల్ HD+ (1,080×2,372 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయి వరకు సపోర్ట్ చేస్తుంది. దీనికి AGC DT-Star D+ ప్రొటెక్షన్ కూడా ఉంది.

ప్రాసెసర్:
ఇది మీడియాటెక్ హెలియో G100 చిప్‌సెట్‌తో పాటు 8GB LPDDR4x RAMతో పనిచేస్తుంది. ఇది 128GB, 256GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్:
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌OS15 (ColorOS 15)పై రన్ అవుతుంది.

బ్యాటరీ:
ఇది 7,000mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Crime News: రాజధానిలో ఆగని క్రైమ్.. మరో మృతదేహం కలకలం

కెమెరా:
ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP మోనోక్రోమ్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ముందు భాగంలో 16MP సెన్సార్ ఉంది.

సెక్యూరిటీ:
సెక్యూరిటీ కోసం, ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

ఇతర ఫీచర్లు:
ఇది IP69రేటింగ్‌, సూపర్ కూల్ వీసీ సిస్టమ్, 4,300 చ.మీ.మీ వ్యాపర్‌ కూలింగ్ ఛాంబర్, AI గేమ్‌బూస్ట్ 2.0 వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది.

Exit mobile version