Site icon NTV Telugu

Smartphone Launch in India: అదిరిపోయే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న వన్ ఫ్లస్ టర్భో

Untitled Design (2)

Untitled Design (2)

అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే భారత మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండగా, సామాన్య వినియోగదారులకు సరిపోయే ఫోన్లతో పాటు ఖరీదైన ప్రీమియం మోడళ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ సంస్థ నుంచి కొత్తగా వన్‌ప్లస్ టర్బో సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే.. కొత్త సంవత్సరం కానుకగా ఈ ఫోన్‌ను జనవరిలో చైనా మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. భారత మార్కెట్లో ఈ మొబైల్‌ను 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విడుదల చేసే అవకాశం ఉందని కంపెనీ మెనేజ్మెంట్ వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే, వన్‌ప్లస్ టర్బో ఫోన్‌లో 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే, 9000mAh శక్తివంతమైన బ్యాటరీ ఉండనుండగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించనుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గ్రీన్, సిల్వర్ రంగుల్లో లభించనుంది. పనితీరుకు ఎలాంటి లోటు లేకుండా 16GB RAM మరియు 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌తో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. మొత్తంగా, ఈ వన్‌ప్లస్ టర్బో సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వస్తే వినియోగదారుల దృష్టిని ఆకర్షించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Exit mobile version