OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
- వన్‌ప్లస్ టర్బో 6x
- జూన్ 18న చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నారు
- 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్‌ప్లస్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ టర్బో 6X విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 18న చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. అనంతరం దీనిని ఇతర మార్కెట్లలో రీబ్రాండ్ చేసి విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకురానున్న ఈ ఫోన్లో భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
జూన్ 18న అధికారిక లాంచ్
వన్‌ప్లస్ టర్బో 6X లాంచ్‌కు సంబంధించిన సమాచారం చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో ద్వారా వెల్లడైంది. నివేదికల ప్రకారం, ఈ ఫోన్లో 6.72 అంగుళాల LCD డిస్ప్లే ఉండనుంది. డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
Also Read
- Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
- Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
- iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
- Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
కెమెరా, బ్యాటరీ ఫీచర్లు
వన్‌ప్లస్ టర్బో 6X వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించనున్నట్లు సమాచారం. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. ఈ ఫోన్లో భారీ 8,000mAh బ్యాటరీ ఉండనుందని, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుందని సమాచారం. అలాగే IP64 రేటింగ్‌తో వాటర్, డస్ట్ నుంచి రక్షణ లభించనుంది.
టర్బో 6X ప్రో కూడా రానుందా?
వన్‌ప్లస్ టర్బో 6Xతో పాటు కంపెనీ ప్రో వెర్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోన్లో 1.5K రిజల్యూషన్ OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండవచ్చని అంచనా.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న టర్బో 6
వన్‌ప్లస్ ఇప్పటికే చైనాలో టర్బో 6 మోడల్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, 12GB RAM, 512GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం OIS సపోర్ట్‌తో 50MP ప్రధాన కెమెరా, 2MP మోనో సెన్సార్‌ను అందించారు. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. అదనంగా, 9,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
భారత్‌లో ఏ పేరుతో రానుంది?
టెక్ వర్గాల సమాచారం ప్రకారం, వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్‌లోని కొన్ని మోడళ్లను భారత మార్కెట్లో నార్డ్ సిరీస్ పేరుతో రీబ్రాండ్ చేసి విడుదల చేసే అవకాశం ఉంది. అయితే టర్బో 6X భారత మార్కెట్లో ఏ పేరుతో అందుబాటులోకి వస్తుందనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
- Tags
- OnePlus
- OnePlus Turbo 6X
తాజావార్తలు
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!