Site icon NTV Telugu

మిడ్‌రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 165Hz డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Turbo 6 సిరీస్ లాంచ్..!

Oneplus Turbo6

Oneplus Turbo6

OnePlus Turbo 6 and OnePlus Turbo 6V: వన్ ప్లస్ (OnePlus) కొత్త టర్బో (Turbo) సిరీస్ లో భాగంగా చైనాలో వన్‌ప్లస్ టర్బో 6 (OnePlus Turbo 6), వన్‌ప్లస్ టర్బో 6V (OnePlus Turbo 6V) స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఈ ఫోన్లు ముఖ్యంగా గేమింగ్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్నాయి.

డిస్‌ప్లే & డిజైన్:
ఈ రెండు ఫోన్లలో 6.78 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉంది. టర్బో 6లో 165Hz, టర్బో 6Vలో 144Hz రిఫ్రెష్ రేట్ అందించారు. PWM + DC డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లకు ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు. లైట్ చేజర్ సిల్వర్, సోలో బ్లాక్, వైల్డ్ గ్రీన్ రంగుల్లో ఇవి లభిస్తాయి. మైక్రాన్-లెవల్ సిల్క్ టెక్స్చర్ ఫినిష్‌తో పాటు IP66 / IP68 / IP69 / IP69K వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి.

ఒప్పో నుంచి కొత్త పవర్‌హౌస్.. Oppo Pad 5 లాంచ్.. 10050mAh బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లు!

ప్రాసెసర్‌:
OnePlus Turbo 6లో లేటెస్ట్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌తో వస్తోంది. 165FPS నేటివ్ గేమింగ్ సపోర్ట్‌తో Call of Duty Mobile వంటి గేమ్స్‌లో ఫుల్ ఫ్రేమ్ రేట్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా డెవలప్ చేసిన విండ్ స్పీడ్ గేమింగ్ కెర్నల్, గ్లేసియర్ కూలింగ్ సిస్టం, ఈ-స్పోర్ట్స్ Wi-Fi చిప్ G1 వల్ల ఎక్కువ సమయం హై-పర్ఫార్మెన్స్ గేమింగ్ సాధ్యం అవుతుంది. అలాగే Turbo 6Vలో కొత్త Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌తో 144Hz గేమింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ & ఛార్జింగ్:
Turbo సిరీస్‌లో తొలిసారిగా 9000mAh భారీ బ్యాటరీ అందించారు. దీనికి 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లో కొత్త రికార్డ్‌గా వన్ ప్లస్ చెబుతోంది.

కెమెరా సెటప్:
ఈ రెండు ఫోన్లలో 50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 2MP మోనోక్రోమ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. వీటికి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ధరలు:
వన్ ప్లస్ టర్బో 6V మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు 1899 యువాన్ (24,400)గా నిర్ణయించగా, 12GB + 256GB వేరియంట్ ధర 2099 యువాన్ (26,975)గా ఫిక్స్ చేశారు. ఇక 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్‌ను 2399 యువాన్ (30,830) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్టైల్ + టెక్ కాంబో.. మోటరోలా సంచలనం.. moto Sound Flow, moto Watch, moto Pen Ultra, moto Tag 2లు లాంచ్..!

అదేవిధంగా వన్ ప్లస్ టర్బో 6 మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2299 యువాన్ (29,545)గా ఉండగా, 16GB + 256GB వేరియంట్‌ను 2599 యువాన్ (33,400)కి విక్రయించనున్నారు. 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2799 యువాన్ (35,970), ఇక 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ కలిగిన టాప్ ఎండ్ మోడల్ ధర 3099 యువాన్ (39,830)గా నిర్ణయించారు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు జనవరి 9 నుంచి చైనాలో అమ్మకాలకు రానుండగా, తొలి సేల్‌లో భాగంగా వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. లీక్‌ల ప్రకారం వన్ ప్లస్ టర్బో 6V భారత్‌లో Nord CE సిరీస్ పేరుతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Exit mobile version