Best Phone Under 40000: ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో అసలు కన్ఫ్యూజన్ ఏంటంటే… ఏ ఫోన్ చెడ్డది కాదు. కానీ ఏది మన అవసరానికి బాగా సరిపోతుందో అర్థం చేసుకోవడమే కష్టం. ముఖ్యంగా రూ.40 వేల ధర పరిధిలోకి వస్తున్న ఫోన్లు ఇప్పుడు ఫ్లాగ్ షిప్ స్థాయి ఫీచర్లను అందిస్తున్నాయి. గేమింగ్ కోసం ఒకటి, కెమెరా కోసం మరొకటి, బ్యాటరీ కోసం ఇంకొకటి అంటూ ప్రతి బ్రాండ్ తనదైన స్ట్రాటజీతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోటీలో తాజాగా వన్‌ప్లస్ నార్డ్ 6 ఎంట్రీ ఇవ్వగా, ఇప్పటికే iQOO నియో 10 5G, Vivo V60 వంటి ఫోన్లు మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తున్నాయి. దీంతో ఈ మూడు ఫోన్లలో ఏది నిజంగా బెస్ట్ అనే చర్చ టెక్ సర్కిల్స్‌లో వేడెక్కుతోంది.
వన్‌ప్లస్ నార్డ్ 6 vs ఐక్యూఓఓ నియో 10 5జి vs వివో వి60 డిస్ప్లే
డిస్ప్లే విషయానికి వస్తే వన్‌ప్లస్ నార్డ్ 6 గేమింగ్, మల్టీమీడియా వినియోగదారులను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ఇచ్చిన 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే 165Hz రిఫ్రెష్ రేట్‌తో రావడం ఈ సెగ్మెంట్‌లోనే హైలైట్‌గా మారింది. అంతేకాదు 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కారణంగా అవుట్‌డోర్ విజిబిలిటీ కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మరోవైపు iQOO నియో 10 5G కూడా దాదాపు ఇదే స్థాయి స్పెక్స్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో గేమింగ్ యూజర్లను ఆకర్షిస్తోంది. Vivo V60 మాత్రం కొంచెం బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ తీసుకుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చినా, ZEISS కెమెరా ఎక్స్‌పీరియన్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
పర్ఫార్మెన్స్ విషయంలో వన్‌ప్లస్ నార్డ్ 6, iQOO నియో 10 5G మధ్య అసలు పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ రెండు ఫోన్లలోనూ Qualcomm Snapdragon 8s Gen 4 చిప్‌సెట్ ఉండటం వల్ల హెవీ గేమింగ్, వీడియో ఎడిటింగ్, AI ఫీచర్లు వంటి పనులను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. అయితే Vivo V60లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉండటం వల్ల డైలీ యూజ్‌కు బాగానే సరిపోతుంది కానీ పవర్ యూజర్లకు మాత్రం మిగతా రెండు ఫోన్లు మరింత బెటర్ ఛాయిస్‌గా కనిపిస్తున్నాయి.
కెమెరా
కెమెరా విభాగంలో మాత్రం Vivo V60 స్పష్టంగా ముందంజలో నిలుస్తోంది. ZEISS బ్రాండింగ్‌తో వచ్చిన 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 50MP సూపర్ టెలిఫోటో లెన్స్ ఇవ్వడం ఫోటోగ్రఫీ లవర్స్‌కు పెద్ద ప్లస్. ముఖ్యంగా పోర్ట్రెయిట్ ఫోటోలు, జూమ్ షాట్స్ తీసే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ 6, iQOO నియో 10 5G రెండూ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో దాదాపు సమానమైన సెటప్‌ను అందిస్తున్నాయి. సెల్ఫీ కెమెరా విషయంలో Vivo V60లో 50MP ఫ్రంట్ కెమెరా ఉండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు.
బ్యాటరీ
బ్యాటరీ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6 నిజంగా షాక్ ఇచ్చింది. ఏకంగా 9000mAh బ్యాటరీతో రావడం ఈ ఫోన్‌ను పవర్ యూజర్లకు డ్రీమ్ డివైస్‌గా మార్చే అవకాశం ఉంది. 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. iQOO నియో 10 5Gలో 7000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా చాలా వేగంగా చార్జ్ అవుతుంది. Vivo V60లో 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మూడు ఫోన్లకూ IP68, IP69 రేటింగ్స్ ఉండటం వల్ల డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ విషయంలో కూడా మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది.
వాటర్ రెసిస్టెన్స్ లో కూడా మంచి ప్రొటెక్షన్ ఉండటంతో దీనిని కూడా వినియోగదారులు ఇష్టపడుతున్నారు. మరి మీకు ఎలాంటి ఫీచర్ కావాలో తెలుసుకుని అవి మీకు ఎంత వరకు ఉపయోగపడతాయో తెలుసుకుని, వీటిని కొనుగోలుచేస్తే బెటర్ గా ఉంటుంది.
ధరల విషయానికి వస్తే
ధరల పరంగా చూస్తే iQOO నియో 10 5G కొంచెం అగ్రెసివ్ ప్రైసింగ్‌తో వస్తోంది. దీని 8GB + 256GB వేరియంట్ ధర రూ.37,999 కాగా, 12GB వేరియంట్ రూ.42,999గా ఉంది. Vivo V60 8GB + 256GB మోడల్ ధర రూ.38,999. వన్‌ప్లస్ నార్డ్ 6 మాత్రం కొంచెం ప్రీమియం సెగ్మెంట్ వైపు వెళ్లింది. దీని బేస్ వేరియంట్ రూ.41,999 నుంచి ప్రారంభమవుతుంది. మొత్తంగా గేమింగ్, రా పర్ఫార్మెన్స్ కావాలంటే iQOO నియో 10 5G మంచి డీల్‌గా కనిపిస్తుండగా, కెమెరా, ప్రీమియం ఫోటోగ్రఫీ అనుభవం కోరుకునేవారికి Vivo V60 బెస్ట్ ఆప్షన్‌గా మారుతోంది. భారీ బ్యాటరీ, ఫ్లూయిడ్ డిస్ప్లే, ఆల్‌రౌండ్ అనుభవం కోరుకునేవారికి మాత్రం వన్‌ప్లస్ నార్డ్ 6 ప్రత్యేకంగా ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
