OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!

  • వన్‌ప్లస్ ఎన్6 లైట్ సెప్టెంబర్ 22న భారత్‌లో లాంచ్
  • 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ
  • సాధారణ వినియోగంలో మూడు రోజుల బ్యాకప్..
Oneplus N6 Lite

Oneplus N6 Lite

OnePlus N6 Lite: వన్‌ప్లస్ తన బడ్జెట్‌ N-సిరీస్‌లో భాగంగా OnePlus N6 Lite స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్‌ బిల్డ్, ఏఐ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 22, 2026న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

7,000mAh భారీ బ్యాటరీ

వన్‌ప్లస్ N6 లైట్‌లో ప్రధాన ఆకర్షణ 7,000mAh బ్యాటరీ నిలవనుంది. కంపెనీ నిర్వహించిన పరీక్షల ప్రకారం ఈ ఫోన్‌లో ఒకసారి ఛార్జ్ చేస్తే 26.8 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 29.9 గంటల వరకు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, 49.7 గంటల వరకు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. సాధారణ వినియోగంలో మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని వన్‌ప్లస్ చెబుతోంది.

అంతేకాకుండా వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో ఫోన్‌ను ఇతర పరికరాలు, యాక్సెసరీలకు పవర్‌ సోర్స్‌గా ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ 1,600 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా 80 శాతానికి పైగా సామర్థ్యాన్ని కొనసాగించేలా రూపొందించారు. ఇది సాధారణ వినియోగంలో సుమారు ఆరేళ్లకు సమానమని కంపెనీ చెబుతోంది.

120Hz డిస్‌ప్లే..

OnePlus N6 Liteలో 6.75 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్‌పై నీటి చుక్కలు, తేమ లేదా నూనె ఉన్నప్పటికీ టచ్ ఇన్‌పుట్‌ను సరిగ్గా గుర్తించేలా “ఆక్వా టచ్” టెక్నాలజీని అందించారు. 7,000mAh భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.95 మిల్లీమీటర్లు, బరువు సుమారు 215 గ్రాములుగా ఉంది.

మిలిటరీ-గ్రేడ్ బిల్డ్

మన్నిక విషయంలోనూ వన్‌ప్లస్ N6 లైట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఫోన్ MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. రోజువారీ వినియోగంలో ఎదురయ్యే దెబ్బలు, పడిపోవడం వంటి పరిస్థితులను తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ హైప్, నియో గ్రీన్ అనే రెండు రంగుల్లో లభించనుంది.

ఏఐ ఫీచర్లు కూడా..

సాఫ్ట్‌వేర్ పరంగా OnePlus N6 Liteలో 36 నెలల ఫ్లుయెన్సీ సర్టిఫికేషన్ ఉంది. మూడు సంవత్సరాల వినియోగం తర్వాత కూడా ఫోన్ పనితీరు గణనీయంగా తగ్గకుండా ఉండేలా పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. ఫొటో ఎడిటింగ్ కోసం AI Eraser, AI Clear Face వంటి ఏఐ టూల్స్ ఉన్నాయి. అలాగే గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌ ద్వారా సెర్చ్‌, కంటెంట్ డ్రాఫ్టింగ్, రోజువారీ పనులను నిర్వహించడంలో సహాయం పొందవచ్చు.

ధర

OnePlus N6 Lite సెప్టెంబర్ 22, 2026న భారత్‌లో లాంచ్ కానుంది. అయితే ఫోన్ అధికారిక ధర, ప్రారంభ ఆఫర్లు, ఓపెన్ సేల్ తేదీని కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనుంది. భారత్‌లో ఈ ఫోన్ OnePlus.in, OnePlus Store App, అమెజాన్, అధికారిక OnePlus Experience Storesతో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకాలు జరపనున్నారు.