OnePlus Ace 7 Series: వన్‌ప్లస్ (OnePlus) ఏస్ (Ace) సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. గత ఏడాది అక్టోబర్‌లో OnePlus Ace 6ను తీసుకురాగా, ఈ ఏడాది ప్రారంభంలో OnePlus Ace 6 Ultraను విడుదల చేసిన సంస్థ.. ఇప్పుడు OnePlus Ace 7 సిరీస్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోన్లు ఇంజినీరింగ్ శాంపిల్ దశలో ఉన్నట్లు లీకులు సూచిస్తున్నాయి.
చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. OnePlus Ace 7 సిరీస్‌లో OnePlus Ace 7, OnePlus Ace 7 Pro మోడళ్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా Snapdragon ప్రాసెసర్లతో వచ్చే అవకాశమున్నట్లు లీక్‌లో పేర్కొన్నారు. ఒక మోడల్‌లో Snapdragon 8 Elite Gen 5 (SM8850) చిప్‌సెట్ ఉండగా, మరో మోడల్‌లో అదే చిప్‌సెట్‌కు ప్రత్యేకంగా రూపొందించిన SM8850Q వెర్షన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు.
ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. OnePlus Ace 7 సిరీస్‌లోని ఫోన్లకు 6.78 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్, 1.5K రిజల్యూషన్, 185Hz రిఫ్రెష్ రేట్ అందించే అవకాశం ఉందని సమాచారం. బ్యాటరీ పరంగా కూడా వన్‌ప్లస్ పెద్ద అప్‌గ్రేడ్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లలో 9,000mAh భారీ బ్యాటరీని అందించే అవకాశం ఉందని లీక్ పేర్కొంది. అలాగే 100W లేదా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని సమాచారం. దీంతో ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను ఈ ఫోన్లు ఆకట్టుకునే అవకాశముంది.
మరోవైపు కెమెరా విభాగంలో OnePlus Ace 7 Pro మోడల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో Samsung JN5 సెన్సార్ ఆధారిత 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉండొచ్చని లీక్ తెలిపింది. వీటితోపాటు ఈ ఫోన్లలో యాక్టివ్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్, మినిమలిస్టిక్ డిజైన్ వంటి ఫీచర్లు ఉండవచ్చని సమాచారం. గేమింగ్ మరియు హెవీ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్లు ఉపయోగపడే అవకాశం ఉంది.
అయితే OnePlus Ace 7 సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ధర, లాంచ్ తేదీ వంటి అంశాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ లీకులను ప్రాథమిక సమాచారంగానే పరిగణించాలి.

