Site icon NTV Telugu

OnePlus 16 Leaks: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, ఇంకా ఎన్నెన్నో.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ షేకే ఇగ!

Oneplus 16 Leaks

Oneplus 16 Leaks

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ను మరోసారి షేక్ చేయడానికి చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే వన్‌ప్లస్ 16 (OnePlus 16) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు తాజాగా లీక్ అయ్యాయి. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ.. ప్రతి విభాగంలోనూ ఈ ఫోన్ టాప్-ఎండ్ ఫీచర్లతో రానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్‌ కంపెనీ తన వన్‌ప్లస్‌ 15 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 2025లో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

వన్‌ప్లస్‌ 16లో BOE X5 1.5K ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రానుంది. ఈ స్క్రీన్‌కు 240Hz అల్ట్రా హై రిఫ్రెష్ రేట్ ఉండనుంది. ఇది గేమింగ్, స్క్రోలింగ్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లనుంది. విజువల్స్ విషయంలో వన్‌ప్లస్ ఈసారి ఎలాంటి రాజీ పడడం లేదని లీక్ వివరాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌లో లేటెస్ట్ Snapdragon 8 Elite Gen 6 Pro ప్రాసెసర్ ఉండనున్నట్లు సమాచారం. దీనికి తోడుగా LPDDR6 ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ కాంబినేషన్ ఇవ్వనున్నారు. దీంతో మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్, AI టాస్కులు స్మూత్‌గా ఉంటాయి.

కెమెరా విభాగంలో వన్‌ప్లస్‌ 16లో భారీ అప్‌గ్రేడ్ ఉండే అవకాశం ఉంది. 200MP HP5 పెరిస్కోప్ కెమెరాతో పాటు, 200MP మెయిన్ కెమెరా (HP5 సెన్సార్) ఉండనున్నట్లు టాక్. కొత్త అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇవ్వనున్నారు. ఫోటోగ్రఫీ, జూమ్ పరంగా ఇది ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వగలదు. బ్యాటరీ విషయంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఉంది. ఇందులో 9000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. అంతేకాదు 120W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో అతి తక్కువ సమయంలో ఫుల్ చార్జ్ అయ్యేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Most Valuable Actors: నంబర్ వన్‌గా ప్రభాస్ ‘రాజు’.. టాప్-10 ఇండియన్ స్టార్స్ లిస్ట్ ఇదే!

ఆడియో, హాప్టిక్స్ పరంగా కూడా వన్‌ప్లస్‌ 16లో టాప్ క్లాస్ ఫీచర్లు ఉండనున్నాయి. డ్యూయల్ కోయాక్షియల్ స్పీకర్లు, ప్రీమియం 0916T హాప్టిక్ మోటార్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ 2.0 ఈ ఫోన్‌లో ఉండనున్నట్లు సమాచారం. ఇవన్నీ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచనున్నాయి. మొత్తంగా చూస్తే వన్‌ప్లస్‌ 16 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసేలా కనిపిస్తోంది. అధికారిక లాంచ్ డేట్, ధర వివరాలపై వన్‌ప్లస్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ లీక్ స్పెసిఫికేషన్లు టెక్ లవర్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

Exit mobile version