OnePlus 15R: వన్‌ప్లస్ 15ఆర్ 16GB RAM వేరియంట్‌ రిలీజ్.. 7,400mAh బ్యాటరీ

  • వన్‌ప్లస్ 15ఆర్ 16GB RAM వేరియంట్‌ రిలీజ్
  • 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.61,999
  • 7,400mAh బ్యాటరీ
Oneplus 15r

Oneplus 15r

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15R కోసం కొత్త 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గతంలో ఈ ఫోన్ 12GB RAM వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు అధిక పనితీరు కోరుకునే వినియోగదారుల కోసం 16GB RAM ఆప్షన్‌ను తీసుకొచ్చింది. కొత్త వేరియంట్‌లో RAM స్టోరేజ్ సామర్థ్యం పెరిగినప్పటికీ, ఫోన్‌లోని మిగతా స్పెసిఫికేషన్లు యథాతథంగానే ఉన్నాయి.

ధర, లభ్యత

భారత మార్కెట్లో కొత్త 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.61,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

×
×
Ad

ఇతర వేరియంట్‌ల ధరలు:

12GB RAM + 256GB స్టోరేజ్ – రూ.54,999
12GB RAM + 512GB స్టోరేజ్ – రూ.59,999
16GB RAM + 512GB స్టోరేజ్ – రూ.61,999

డిజైన్, డిస్‌ప్లే

వన్‌ప్లస్ 15Rలో 6.83 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీ, 100% DCI-P3 కలర్ గామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లను పొందింది.

శక్తివంతమైన ప్రాసెసర్

ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ను అమర్చారు. 3nm టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ ప్రాసెసర్ గరిష్టంగా 3.8GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. Adreno GPU, 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్, G2 Wi-Fi చిప్, టచ్ రెస్పాన్స్ చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

7,400mAh భారీ బ్యాటరీ

వన్‌ప్లస్ 15Rలో ప్రధాన ఆకర్షణ 7,400mAh భారీ బ్యాటరీ. దీనికి 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. దీంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

కెమెరా ఫీచర్లు

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ 4K వీడియోలను 120fps వరకు రికార్డ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.