Site icon NTV Telugu

OnePlus 15 vs iQOO 15 vs Realme GT 8 Pro Comparison: మూడు ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ రివ్యూ.. బెస్ట్ మొబైల్ ఏదంటే?

Oneplus 15 Vs Iqoo 15 Vs Realme Gt 8 Pro Comparison

Oneplus 15 Vs Iqoo 15 Vs Realme Gt 8 Pro Comparison

OnePlus 15 vs iQOO 15 vs Realme GT 8 Pro Review: ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌లో వన్‌ప్లస్‌ 15 (OnePlus 15), ఐకూ 15 (iQOO 15), రియల్‌మీ జీటీ 8 ప్రో (Realme GT 8 Pro) మోడళ్ల మధ్య గట్టి పోటీ ఉంది. ఈ మూడు ఫోన్లను ఓ టెక్ యూసర్ వాడాడు. అతడు ప్రత్యక్షంగా ఉపయోగించిన అనుభవం ఆధారంగా.. ప్రతి ఫోన్‌కు ప్రత్యేకమైన బలాలు, బలహీనతలు ఉన్నట్టు చెప్పాడు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.

డిస్‌ప్లే :
డిస్‌ప్లే విషయంలో ఐకూ 15 ముందంజలో నిలిచింది. కలర్, బ్రైట్‌నెస్, స్క్రోలింగ్ స్మూత్‌నెస్ పరంగా ఇది మిగతా రెండింటికంటే మెరుగ్గా ఉంటుంది. రెండో స్థానంలో వన్‌ప్లస్‌ 15, మూడో స్థానంలో రియల్‌మీ జీటీ 8 ప్రో నిలిచాయి. అయితే స్పీకర్ల పరంగా మాత్రం వన్‌ప్లస్‌ 15 అత్యుత్తమ ఆడియో అవుట్‌పుట్ ఇచ్చింది. రియల్‌మీ ఫోన్ రెండో స్థానంలో ఉండగా.. ఐకూ కాస్త వెనుకబడి ఉంది. హాప్టిక్స్ విషయంలో ఐకూ అత్యధిక ఇన్‌టెన్సిటీతో బెస్ట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. రియల్‌మీ రెండో స్థానంలో వన్‌ప్లస్‌ మూడో స్థానంలో నిలిచింది.

బ్యాటరీ బ్యాకప్:
పనితీరు పరంగా ఐకూ 15, వన్‌ప్లస్‌ 15 రెండూ బాగున్నాయి. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో రెండూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. పనితీరులో రియల్‌మీ జీటీ 8 ప్రో మాత్రం కాస్త వెనుకబడింది. యూజర్ ఇంటర్‌ఫేస్ విషయంలో వన్‌ప్లస్‌ అగ్ర స్థానంలో ఉంది. వేగంగా అప్డేట్స్, సూపర్ సాఫ్ట్‌వేర్ దీనికి ప్లస్ పాయింట్. రియల్‌మీ UI కూడా బాగానే ఉన్నప్పటికీ.. ఐకూ UI కాస్త తక్కువగా ఉంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్‌లో వన్‌ప్లస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఛార్జింగ్ స్పీడ్ వేగంగా ఉండగా.. బ్యాటరీ బ్యాకప్ కూడా బలంగా ఉంది. రియల్‌మీ రెండో స్థానంలో ఉండగా.. ఐకూ మూడో స్థానంలో నిలిచింది.

Also Read: PAK Playing XI vs NAM: నమీబియాతో మ్యాచ్‌.. పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌పై హై డ్రామా!

కెమెరా విభాగం విభాగం:
కెమెరా విభాగంలో మొత్తం పనితీరు పరంగా వన్‌ప్లస్‌ 15 బెస్ట్‌గా నిలిచింది. ప్రధాన కెమెరా, అల్ట్రావైడ్, వీడియో స్టెబిలైజేషన్, లో లైట్ ఫోటోగ్రఫీ వంటి విభాగాల్లో అద్భుతం. అయితే పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో ఐకూ 15 మెరుగ్గా ఉండగా.. పెరిస్కోప్ జూమ్ విషయంలో రియల్‌మీ జీటీ 8 ప్రో ముందుంది. స్కిన్ టోన్స్ విషయానికి వస్తే వన్‌ప్లస్‌ సహజ రంగులను అందించగా.. రియల్‌మీ కొంచెం రెడ్డిష్ టోన్ ఇచ్చింది. ఐకూ మాత్రం కొద్దిగా వైట్ టోన్ వైపు మొగ్గు చూపింది.

ఫైనల్లీ:
మొత్తంగా చూస్తే ప్రతి ఫోన్ ఒక ప్రత్యేక విభాగంలో మెరుగ్గా నిలుస్తోంది. బెస్ట్ ఆల్‌రౌండర్ కావాలంటే వన్‌ప్లస్‌15 మంచి ఎంపిక. డిస్‌ప్లే, హాప్టిక్స్ ప్రాధాన్యత ఉంటే ఐకూ 15 సరైన ఎంపిక. జూమ్ కెమెరా, బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు కావాలంటే రియల్‌మీ జీటీ 8 ప్రో కూడా మంచి ప్రత్యామ్నాయం.

Exit mobile version