ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ OnePlus లేటెస్ట్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. OnePlus ఇటీవల భారత్ లో OnePlus 13 సిరీస్‌ను విడుదల చేసింది. OnePlus 13, OnePlus 13R. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను కాంపాక్ట్ సైజులో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. OnePlus కంపెనీ OnePlus 13T లేదా OnePlus 13 Mini పేరుతో లాంచ్ చేయవచ్చని సమాచారం.
Also Read:Amaravati Capital: రాజధాని పనుల ప్రారంభానికి రెడీ.. ప్రధాని మోడీకి ఏపీ సర్కార్ ఆహ్వానం..!
OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో కాంపాక్ట్ డిజైన్‌తో లాంచ్ చేయనుంది. OnePlus 13T 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఈ OnePlus ఫోన్ 6000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అమర్చారని టాక్. కెమెరా విషయానికి వస్తే.. ఈ OnePlus ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్ ఉంటుంది.
Also Read:Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీలో పోలీసుల భారీ భద్రత
OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్‌లో భద్రత కోసం ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వవచ్చు. OnePlus 13 లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చింది. వన్‌ప్లస్ నుంచి రాబోయే కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను ఏప్రిల్ 2025 నాటికి లాంచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.