Nothing Phone 4a Series: నథింగ్ (Nothing) సంస్థ నుండి కొత్తగా Nothing Phone 4a సిరీస్ ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. అందిన నివేదిక ప్రకారం.. ఈ సిరీస్ మార్చి 2026లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్‌లో నథింగ్ ఫోన్ 4aతో పాటు నథింగ్ ఫోన్ 4a ప్రో మోడల్‌లు ఉండనున్నాయి. ఇప్పటికే నథింగ్ ఫోన్ 4a యూఏఈ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించగా.. ఇప్పుడు దాని ‘ప్రో’ వేరియంట్‌పై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 10,001mAh బ్యాటరీ, 50MPతో Realme P4 Power 5G నేడే లాంచ్
ఇప్పటివరకు సంస్థ అధికారికంగా Nothing Phone 4a Proను ప్రకటించలేదు. అయినప్పటికీ తాజా సర్టిఫికేషన్ డేటా చూస్తే ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉందని స్పష్టమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నథింగ్ ఫోన్ 3a ప్రోకు ప్రత్యామ్నాయంగా రానుందని సమాచారం. ప్రాథమిక లీక్‌ల ప్రకారం ఇందులో స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ తోపాటు 12GB RAM ఉండే అవకాశం ఉంది. తాజాగా యూరోపియన్ యూనియన్ EPREL డేటాబేస్లో దర్శనమిచ్చింది. ఈ డివైస్ మోడల్ నంబర్ A069Pగా లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారానే ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి.
EPREL లిస్టింగ్ ప్రకారం Nothing Phone 4a Proలో 5,080mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఈ బ్యాటరీ 1,400 చార్జింగ్ సైకిళ్ల వరకు పనిచేస్తుందని, ఆ తర్వాత సామర్థ్యం 80 శాతంకు తగ్గుతుందని పేర్కొన్నారు. బ్యాటరీ పరంగా ఇది గత మోడల్ తో పోలిస్తే పెద్ద మార్పు కాకపోయినా, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్, కొత్త చిప్‌సెట్ వల్ల పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
Team India Biggest Defeats: స్వదేశంలో టీమిండియాకు భారీ షాక్.. అతిపెద్ద పరాజయాల లిస్ట్ ఇదే!
Nothing Phone 4a Proకు IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండనుంది. సాఫ్ట్‌వేర్ పరంగా Nothing Phone 4a Proకి దీర్ఘకాల మద్దతు ఇవ్వనుంది. కనీసం 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్, అదే స్థాయిలో ఫంక్షనాలిటీ, బగ్ ఫిక్స్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు EPREL డేటా స్పష్టం చేస్తోంది. ఇది నథింగ్ ఫోన్లకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. లీక్‌ల ప్రకారం Nothing Phone 4a Proలో Snapdragon 7s Gen 4 ప్రాసెసర్, 12GB ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. లీక్‌లు, సర్టిఫికేషన్ వివరాల ఆధారంగా చూస్తే Nothing Phone 4a సిరీస్ (4a & 4a Pro) మార్చి 2026లో భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
