ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. Nokia 235 4G (2026), Nokia 215 4G (2026), Nokia 210 4G, Nokia 200 4G పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు AI అసిస్టెంట్ బటన్, 4G కనెక్టివిటీ, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేయబడగా, ధరలు, విక్రయాల తేదీలను ఇంకా ప్రకటించలేదు.
AI అసిస్టెంట్ బటన్ ప్రధాన ఆకర్షణ
ఈ కొత్త ఫీచర్ ఫోన్లలో ప్రత్యేక AI అసిస్టెంట్ బటన్ ను అందించారు. ఈ బటన్ ద్వారా యూజర్లు వాయిస్ కమాండ్‌లతోనే ఆపరేట్ చేయవచ్చు. వాటిలో.. ఫ్లాష్‌లైట్ ఆన్/ఆఫ్ చేయడం, అలారాలు సెట్ చేయడం, రిమైండర్లు సృష్టించడం, కాంటాక్ట్స్‌లోని వ్యక్తులకు నేరుగా కాల్ చేయడం వంటి పనులు సులభంగా చేయవచ్చు.
13 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
ఈ నాలుగు మోడళ్లలో కూడా 1,450mAh రిమూవబుల్ బ్యాటరీను అందించారు. Nokia 235 4G (2026), Nokia 215 4G (2026) – 10 గంటల టాక్‌టైమ్, 12 రోజుల స్టాండ్‌బై, Nokia 210 4G, Nokia 200 4G – 9 గంటల టాక్‌టైమ్, 13 రోజుల స్టాండ్‌బై అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
డిస్‌ప్లే వివరాలు
Nokia 235 4G (2026), Nokia 215 4G (2026) – 2.8-అంగుళాల IPS QVGA డిస్‌ప్లే
Nokia 210 4G, Nokia 200 4G – 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లే
స్టోరేజ్, సాఫ్ట్‌వేర్
ఈ నాలుగు ఫోన్లు S30+ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తాయి. 64MB RAM, 128MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజ్ విస్తరణ సౌకర్యం అందుబాటులో ఉంది.
కెమెరా ఫీచర్లు
Nokia 235 4G (2026)
2MP రియర్ కెమెరా
LED ఫ్లాష్
VGA సెల్ఫీ కెమెరా
Nokia 215 4G (2026)
VGA ఫ్రంట్ కెమెరా
Nokia 210 4G
VGA రియర్ కెమెరా
LED ఫ్లాష్
VGA ఫ్రంట్ కెమెరా
Nokia 200 4G
VGA ఫ్రంట్ కెమెరా
కనెక్టివిటీ ఫీచర్లు
అన్ని మోడళ్లలో:
4G VoLTE సపోర్ట్
Bluetooth 5.0
USB Type-C పోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
వైర్డ్ & వైర్‌లెస్ FM రేడియో వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ధర ఇంకా వెల్లడి కాలేదు
నోకియా ఈ నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లో పరిచయం చేసినప్పటికీ, వాటి ధరలు, భారత్‌లో విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

