ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోయింది. మ్యూజిక్ లవర్స్, వీడియో కంటెంట్ చూసే టైమ్ లో ఇయర్ ఫోన్స్ నే యూజ్ చేస్తున్నారు. తాజాగా యూజర్లకు స్మార్ట్ గాడ్జెట్ సంస్థ నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి.నాయిస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అయిన “నాయిస్ మాస్టర్ బడ్స్” ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ స్పెషల్ ఫీచర్లతో, స్టైలిష్ లుక్, అడ్వాన్డ్స్ సౌండ్ టెక్నాలజీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో మ్యూజిక్ లవర్స్ కు కొత్త అనుభూతిని అందించేందుకు రూపొందించబడ్డాయి.
Also Read:Bihar: మద్యానికి బానిసైన భర్త.. లోన్ రికవరీ ఏజెంట్‌ని పెళ్లి చేసుకున్న భార్య..
ఈ TWS ఇయర్‌ఫోన్‌లు 12.4mm డ్రైవర్లను కలిగి ఉన్నాయి. LHDC ఆడియో కోడెక్‌కు సపోర్ట్ చేస్తాయి. వీటిపై ‘సౌండ్ బై బోస్’ ట్యాగ్ ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్‌లు 49dB వరకు అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), డ్యూయల్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. ఈ ఆప్షన్ తో ఇయర్‌ఫోన్‌లను ఒకేసారి రెండు ఎలక్ట్రానిక్ పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. నాయిస్ మాస్టర్ బడ్స్ మొత్తం 40 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. IPX5 రేటింగ్ తో వస్తున్నాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)కి సపోర్ట్ చేస్తాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ ను కలిగి ఉన్నాయి. భారత్ లో నాయిస్ మాస్టర్ బడ్స్ ధర రూ. 7,999గా కంపెనీ నిర్ణయించింది.
Also Read:Chintamaneni vs AbbayaChowdary: దెందులూరులో అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతమనేని..
బడ్స్ ప్రస్తుతం అమెజాన్, నాయిస్ ఇండియా ఇ-స్టోర్ ద్వారా దేశంలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు ఒనిక్స్, సిల్వర్, టైటానియం షేడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. రూ. 999 చెల్లించి కస్టమర్లు ఈ బడ్స్‌ను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ-బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ. 2,000 డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. అదనంగా, కస్టమర్లకు రూ. 2,500 విలువైన అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు ఫిబ్రవరి 26 నుండి gonoise.com, Amazon, Reliance Digital, Croma , Vijay Sales లో సేల్ ప్రారంభంకానున్నది.