స్మార్ట్ గాడ్జెట్స్ యూజ్ చేసేందుకు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లుకింగ్, హెల్త్ మానిటరింగ్ కోసం స్మార్ట్ వాచ్ లను యూజ్ చేసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. గాడ్జెట్ తయారీ సంస్థలు లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ గాడ్జెట్ తయారీ సంస్థ నాయిస్ ఏఐ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ పేరుతో విడుదలయ్యాయి.
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 స్మార్ట్‌వాచ్‌లో 1.85-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 390×450 px రిజల్యూషన్ ఉంటుంది. మ్యాక్స్ మోడల్ 1.96 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు వాచ్‌లు నాయిస్ EN2 చిప్‌సెట్ సహా నెబులా UI 2.0 తో పనిచేస్తాయి. ఏఐ ఫీచర్లను కలిగి ఉడటంతో స్లీపింగ్ క్వాలిటీ, వర్కౌట్ డేటా ఆధారంగా హెల్త్ సమాచారాన్ని అదిస్తుంది. ఇందులో ఎమర్జెన్సీ SOS, పాస్ వర్డ్ ప్రొటెక్షన్ ఫీచర్ ను కలిగి ఉంది. లాంగ్ లైఫ్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. సింగిల్ ఛార్జ్ తో 7 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు.
IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అందించారు. ప్రో మోడల్ 100 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను కలిగి ఉంది. బిల్ట్ ఇన్ GPSతో వస్తుంది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 స్మార్ట్‌వాచ్ కలర్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5,999 గా ఉంది. మెష్ స్ట్రాప్ ప్రారంభ ధర రూ. 6,499గా ఉంది. ఇక మ్యాక్స్ మోడల్ ప్రారంభ ధర రూ. 7,499గా ఉంది. మెటల్ స్ట్రాప్ వేరియంట్ ధర రూ. 7,999గా కంపెనీ నిర్ణయించింది. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 6 సిరీస్ స్మార్ట్ వాచ్ లు నాయిస్ అఫీషియల్ వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.