NTV Telugu Site icon

Penalty on Google: గూగుల్‌కు షాక్‌.. ఆ భారీ జరిమానా కట్టాల్సిందే..!

Google

Google

Penalty on Google: గూగుల్‌కు నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లోనూ షాక్‌ తగిలింది.. ప్లేస్టోర్‌ విషయంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్‌సీఎల్ఏటీ.. ఇప్పటికే విధించిన జరిమానా మొత్తం రూ.936.44 కోట్లలో 10 శాతం సొమ్మును నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాల్సిందేనని స్పష్టం చేస ఇంది.. దీంతో, ఎన్‌సీఎల్‌ఏటీలో వారం రోజుల వ్యవధిలోనే గూగుల్‌కు వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలినట్టు అయ్యింది.. ఇక, జరిమానాపై అప్పీల్‌ను ఏప్రిల్ 17వ తేదీన విచారించనుంది. అయితే, భారతీయ కస్టమర్ల కోసం గూగుల్ “డిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్”ని ఆశ్రయిస్తున్నట్లు సీసీఐ ఇంతకు ముందు చెప్పింది. జనవరి 16న సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది.

Read Also: Fight: రెండు గ్రూపుల మధ్య ఆన్‌లైన్ పోస్ట్‌ల చిచ్చు.. ముగ్గురికి కత్తిపోట్లు

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం అమెరికా సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వీ దాఖలు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకుని జనవరి 16న పిటిషన్‌పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.. సీసీఐ అసాధారణ ఆదేశాలు జారీ చేసిందని, జనవరి 19లోగా ఈ ఉత్తర్వులను పాటించాలని సీనియర్ న్యాయవాది తెలిపారు. కాగా, ప్లే స్టోర్‌ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తుండటంతో సీసీఐ రూ.936.44 కోట్ల భారీ జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా, నిర్దేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా సీసీఐ ఆదేశించింది. ఎన్‌సీఎల్‌ఏటీ జనవరి 4న, గూగుల్‌పై రూ. 1,337 కోట్ల పెనాల్టీ విధించే పోటీ నియంత్రణ సంస్థ యొక్క ఆర్డర్‌పై మధ్యంతర స్టేను నిరాకరించింది.. ఆ మొత్తంలో 10 శాతం డిపాజిట్ చేయాలని కోరింది. అలాగే థర్డ్‌-పార్టీ బిల్లింగ్‌/ యాప్‌ల కొనుగోలుకు చెల్లింపు సేవలను వినియోగించుకోకుండా యాప్‌ డెవలపర్లను అడ్డుకోరాదని ఆదేశించింది. అంతకుముందు ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విభాగంలో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నందునందకు గానూ విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాకు ఇది అదనం. మొత్తంగా రూ.2200 కోట్ల జరిమానా విధించింది.

దేశంలో తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించినందుకు, NCLAT CCIకి గూగుల్‌ యొక్క సవాల్‌ను అంగీకరించింది. గత ఏడాది అక్టోబర్‌లో, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి మరియు వారికి నచ్చిన శోధన ఇంజిన్‌ను ఎంచుకోవడానికి అనుమతించమని సీసీఐ గూగుల్‌ని కోరింది.. ఆ ఉత్తర్వులు జనవరి 19 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారతదేశంలో 97 శాతం స్మార్ట్‌ఫోన్‌లకు శక్తినిచ్చే మరియు యూఎస్‌ దిగ్గజానికి కీలకమైన వృద్ధి ప్రాంతమైన Android కోసం మార్కెట్లో దాని ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకున్నందుకు సీసీఐ అక్టోబర్‌లో Alphabet Inc యూనిట్‌కి 161 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అప్పీల్‌ల ట్రిబ్యునల్ యాంటీట్రస్ట్ తీర్పును నిరోధించాలనే దాని అభ్యర్థనను తిరస్కరించడంతో బుధవారం గూగుల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అయితే, శనివారం ట్రిబ్యునల్ తీర్పుపై గూగుల్ ఛాలెంజ్ దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టు రికార్డులు చూపిస్తున్నాయి.. కానీ, విచారణ తేదీ ఇంకా ఫైనల్‌ కానట్టుగా తెలస్తోంది.

Show comments