ప్రీమియం డిజైన్‌, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లే తో Motorola Edge 70 Pro+..!

  • Motorola Edge 70 Pro+ భారత్‌లో త్వరలో లాంచ్
  • “Stunning Inside Out” ట్యాగ్‌లైన్‌తో ఫోన్‌ను టీజ్ చేసిన మోటోరోలా
  • ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తున్న కొత్త Edge సిరీస్ ఫోన్..
Motorola Edge 70 Pro+

Motorola Edge 70 Pro+

Motorola Edge 70 Pro+ : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రీమియం Edge సిరీస్‌ను మరింత పెంచుకునేందుకు మోటోరోలా కొత్త motorola edge 70 Pro+ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో త్వరలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా టీజ్ చేసింది. “Stunning Inside Out” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్‌ను ప్రచారం చేస్తుంది. గత నెల విడుదలైన Edge 70 Proకు ఇది సక్సెసర్‌గా వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో కనిపిస్తున్న అధికారిక లిస్టింగ్‌లు, ప్రమోషనల్ మెటీరియల్ ఆధారంగా చూస్తే ఈ ఫోన్ ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో రానునట్లు తెలుస్తుంది.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో మోటోరోలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. Pantone తో కలిసి రూపొందించిన మూడు డిఫరెంట్ టెక్స్చర్డ్ ఫినిష్‌లలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. Satin-Luxe Finish (Pantone Zinfandel) – వైన్ కలర్ షేడ్‌తో మ్యాట్ ఫినిష్, Twill-Inspired Finish (Pantone Blue Surf) – ఫ్యాబ్రిక్ లాంటి టెక్స్చర్‌తో బ్లూ-గ్రీన్ డిజైన్, Sculpted Wood Finish (Pantone Wood Gold) – వుడ్ గ్రెయిన్ స్టైల్‌లో బ్రౌన్ ఫినిష్ వేరింట్స్ లో లభించనుంది.

ఈ ఫోన్‌లో ఇటీవల వచ్చిన Edge సిరీస్ మాదిరిగానే క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌ను అందించారు. స్లిమ్ అండ్ఎ ర్గోనామిక్ బాడీతో పాటు స్క్వేర్ షేప్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్‌కు సరిపోయేలా రూపొందించారు. ఇక ఇందులో కెమెరా సెటప్ చూస్తే.. 50MP Sony LYTIA 710 ప్రైమరీ సెన్సర్‌ను ఉపయోగించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ (OIS) సపోర్ట్‌తో పాటు moto AI టెక్నాలజీని జోడించడం ద్వారా లో-లైట్ ఫోటోగ్రఫీ, డైనమిక్ రేంజ్, ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్‌ను క్లియర్‌గా క్యాప్చర్ చేయడంలో మెరుగైన ఫలితాలు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 3.5x ఆప్టికల్ జూమ్, 50X Super Zoom Pro ఫీచర్‌ను అందించనున్నట్లు సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 నుంచి 6.8 ఇంచుల సైజ్ కలిగిన 1.5K Quad-Curved AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉండనుంది. ఇక Turbo Power వైర్డ్, వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో లభించనుంది. అయితే ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ వంటి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం మోటోరోలా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ జూన్ ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం.