Motorola Edge 70 Pro: ప్రీమియం డిజైన్, బ్రైట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ కోరుకునే వారికి Motorola Edge 70 Pro బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. 8GB RAM + 256GB స్టోరేజ్, PANTONE Titan Blue Tailored Fabric వేరియంట్‌కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఈ ఫోన్‌లో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం Flipkartలో Edge 70 Pro 8GB + 256GB వేరియంట్ ప్రస్తుతం సుమారు రూ.39,999 ధరకు లిస్ట్ అయ్యింది. దీని అసలు ధర రూ. 69,999గా ఉండగా 43 శాతం డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది.
6.8-అంగుళాల 144Hz AMOLED డిస్‌ప్లే
Motorola Edge 70 Proలో 6.8-అంగుళాల Extreme AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 10-bit కలర్, HDR10+ వంటి ఫీచర్లను అందిస్తుంది. అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్లు, గేమింగ్ వంటి పనుల్లో డిస్‌ప్లే మరింత స్మూత్‌గా అనిపించే అవకాశం ఉంది. స్క్రీన్‌కు Gorilla Glass 7i రక్షణ కూడా ఉంది.
Dimensity 8500 Extreme ప్రాసెసర్
పనితీరు కోసం ఇందులో MediaTek Dimensity 8500 Extreme చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4nm ప్రాసెస్‌పై తయారైన ఈ ప్రాసెసర్‌తో సాధారణ యాప్స్, మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. 8GB LPDDR5X RAM, 256GB UFS 4.1 స్టోరేజ్ ఈ వేరియంట్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను microSD కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు. ఫోన్‌లో వేడిని నియంత్రించేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థ కూడా ఉంది.
50MP డ్యూయల్ కెమెరా సెటప్
ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP Sony LYTIA 710 మెయిన్ కెమెరా, OIS, PDAF, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 122-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఆటోఫోకస్, మాక్రో సపోర్ట్, 50MP ఫ్రంట్ కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఉంది. రియర్, ఫ్రంట్ కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఉంది. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతీయ వేరియంట్‌లో ప్రత్యేక టెలిఫోటో కెమెరా లేదు. కాబట్టి జూమ్ ఫొటోగ్రఫీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
6500mAh బ్యాటరీ.. 90W ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ విషయంలో Motorola Edge 70 Pro ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో 6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. దీనికి 90W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రోజువారీ వినియోగంలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఇది ప్లస్ పాయింట్. ఫోన్ 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే భారతీయ వేరియంట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. Edge 70 Pro డిజైన్ కూడా ఈ ఫోన్‌లో మరో ఆకర్షణ. PANTONE Titan Blue Tailored Fabric ఫినిష్ ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది. IP69 రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్, Gorilla Glass 7i ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Android 16, Hello UI
సాఫ్ట్‌వేర్ పరంగా ఫోన్ Android 16 ఆధారిత Hello UIతో వస్తుంది. Motorola తక్కువగా మార్చిన, సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఇష్టపడే వారికి ఇది నచ్చే అవకాశం ఉంది. ఫోన్‌కు 3 ప్రధాన Android OS అప్‌డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు పేర్కొంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6E/7, Bluetooth 5.4, NFC, GPS, NavIC వంటి ఫీచర్లు ఉన్నాయి. USB Type-C పోర్ట్, స్టీరియో స్పీకర్లు, Dolby Atmos కూడా ఉన్నాయి.

