Site icon NTV Telugu

నిరీక్షణకు ఇక సెలవు.. Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్!

Motorola Edge 70 Fusion

Motorola Edge 70 Fusion

Motorola Edge 70 Fusion Launch: స్మార్ట్‌ఫోన్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మోటోరోలా ఎడ్జ్ 70 ఫుజన్ (Motorola edge 70 fusion) ఫోన్ విడుదల తేదీని అధికారికంగా మోటోరోలా (Motorola) ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో మార్చి 6న లాంచ్ కానుంది. అంతకుముందు ఈ ఫోన్ గ్లోబల్‌గా మార్చి 2న జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఈవెంట్‌ లో పరిచయం కానుంది. ఎడ్జ్ 70 సిరీస్‌ లో ఇది తాజా మోడల్‌గా వస్తుండటంతో వినియోగదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

India Qualification Scenario: భారత్‌ సెమీస్‌కు చేరే నాలుగు అవకాశాలు ఇవే.. డెడ్ ఈజీ సినారియో మాత్రం ఒకటే!

ఈ ఫోన్ ప్రత్యేకతల్లో ముఖ్యంగా పాన్టోన్ సిల్హౌఎట్టే, పాన్టోన్ బ్లూ సర్ఫ్, పాన్టోన్ కంట్రీ ఎయిర్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి లెదర్ ఇన్‌స్పైర్డ్ ఫినిష్‌ తో ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఈ కలర్స్‌ను రూపొందించడంలో ప్రముఖ రంగు ప్రమాణాల సంస్థ పాన్టోన్ భాగస్వామ్యం చేసింది. డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ కేవలం 7.99mm స్లిమ్ బాడీతో స్టైలిష్‌గా ఉంటుంది.

ఫోటోగ్రఫీ పరంగా.. ఇది అత్యాధునిక ఫీచర్లను అందిస్తుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా 50MP Sony LYT-710 కెమెరా సెన్సార్స్ ను ఇందులో ఉపయోగించారు. దీనితో పాటు 13MP అల్ట్రా వైడ్ కెమెరా, మాక్రో సపోర్ట్ మరియు 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇవ్వడం మరో ప్రత్యేకత. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K క్వాడ్ కర్వ్డ్ ట్రూ కలర్ డిస్‌ప్లే ఇవ్వబడింది.

Delhi: ఢిల్లీలో ఓ ఇంటిపై నకిలీ ఈడీ అధికారుల దాడి.. భారీగా నగదు అపహరణ

పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో క్వాల్కమ్ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్, IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో ఈ ఫోన్ మన్నిక పరంగా కూడా బలంగా ఉంటుంది. బ్యాటరీ విషయంలో ఇది భారీ 7000mAh బ్యాటరీ ఇవ్వబడింది. ఇది Moto Edge సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన వాటిలోనే అతిపెద్దది. దీనికి 68W టర్బో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

Exit mobile version