Motorola Edge 2026 Launch: మోటోరోలా (Motorola) ఉత్తర అమెరికా మార్కెట్‌లో కొత్తగా మోటోరోలా ఎడ్జ్ 2026 (Motorola Edge 2026) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది సన్నని, తేలికైన డిజైన్‌తో వస్తోంది. ఈసారి కంపెనీ ప్రత్యేకమైన పాంటోన్ మార్టిని ఆలివ్ (PANTONE Martini Olive) కలర్ వేరియంట్‌ను అందిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో టెక్స్చర్డ్ ఫినిష్ ఉండటం వల్ల ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. డ్యూరబిలిటీ విషయంలో కూడా IP68, IP69 రేటింగ్స్ కారణంగా దుమ్ము, నీరు, ఇసుక వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. వీటితోపాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉండటంతో షాక్‌లు, పడిపోవడం వంటి పరిస్థితులను తట్టుకోగలదు. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్‌ను ఉపయోగించారు.
ఫోటోగ్రఫీ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన కెమెరాగా Sony LYTIA 710 సెన్సార్‌తో 50MP కెమెరాను ఇచ్చారు. ఇది OIS సపోర్ట్‌తో పాటు 4K వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. అలాగే 50MP అల్ట్రా వైడ్ కెమెరా 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ అందించడంతో పాటు మ్యాక్రో ఫోటోగ్రఫీకి కూడా ఉపయోగపడుతుంది. 10MP టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్‌తో పాటు AI ఆధారిత 30x సూపర్ జూమ్ ఫీచర్‌ను అందిస్తుంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ మొబైల్ లో మీడియాటెక్ డిమెంసిటీ 7450 4nm ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది మల్టీటాస్కింగ్, హై రిజల్యూషన్ వీడియో ప్లేబ్యాక్, మొబైల్ గేమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. వినియోగదారులు తమకు నచ్చిన AI అసిస్టెంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. మోటో AI, గూగుల్ జెమినీ లేదా పెర్ప్లేక్సిటీ సేవలను ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.3 అంగుళాల 1.5K Extreme AMOLED డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్పష్టమైన విజిబిలిటీ లభిస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు Dolby Atmos టెక్నాలజీని అందించారు. దీంతో సినిమాలు, సంగీతం వినేటప్పుడు మెరుగైన అనుభవం లభిస్తుంది.
Motorola Edge 2026లో 5000mAh బ్యాటరీను అందించారు. సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ తెలిపింది. ఫోన్ 60W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కేవలం కొన్ని నిమిషాల ఛార్జింగ్‌తో రోజంతా ఉపయోగించేంత పవర్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అదనంగా 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 11 నుంచి అమెరికాలో విక్రయాలకు అందుబాటులోకి రానుంది. దీని ధర 599.99 డాలర్లు (రూ.57,230)గా నిర్ణయించారు.
Capturing pro-level photos is easier than ever with the new motorola edge – 2026📸☀️
Learn more: https://t.co/kS8yltlRji
Prendre des photos de qualité professionnelle est plus facile que jamais grâce au nouveau motorola edge – 2026 📸☀️
En savoir plus: https://t.co/NTo2mXB6fi pic.twitter.com/zPPuoihyG9
— Motorola Canada (@MotorolaCA) June 2, 2026
