Site icon NTV Telugu

Moto G64 5G: భారత్ మార్కెట్ లోకి మోటో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

Mto

Mto

ప్రముఖ మొబైల్స్ కంపెనీ మోటో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి… తాజాగా మరో సూపర్ ఫోన్ ను భారత్ మార్కెట్ లోకి వదిలింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మోటో జీ64 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేశారు… గతంలో వచ్చిన ఫోన్లకు అప్డేట్ గా ఈ ఫోన్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.. అంతేకాదు మైక్రొ మెమొరీ కార్డులతో ఇంకా స్టోరేజ్ ను పెంచుకొనే అవకాశాలు ఉన్నాయి..

కెమెరా విషయానికొస్తే.. ఈ కొత్త సెల్ఫీ ప్రియులకు బాగా పనికొస్తుంది.. 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. దీని ద్వారా మాక్రో ఫొటోలు తీసుకోవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఏకంగా 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది..

ధర విషయానికొస్తే.. మోటో నుంచి వచ్చిన కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో రాబోతుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ను రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు.. కొన్ని ప్రత్యేకమైన కార్డులతో భారీ తగ్గింపు కూడా ఉందని తెలుస్తుంది..

Exit mobile version