Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్‌.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!

Meta Fined 375 Million

Meta Fined 375 Million

Meta Smart Glasses: Meta తన స్మార్ట్ టెక్నాలజీలో మరో కీలక ముందడుగు వేసింది. వినియోగదారులు కేవలం గాలిలో వేళ్లను కదిలించడం ద్వారా వాట్సాప్ సహా ఇతర మెసేజింగ్ యాప్‌లలో మెసేజ్‌లు పంపగలిగే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ సరికొత్త టెక్నాలజీ Meta Ray-Ban Smart Glasses తో పనిచేస్తుంది. మెటా ఆరు నెలల క్రితం విడుదల చేసిన ఈ AI స్మార్ట్ గ్లాసెస్‌కు ఇప్పుడు మరిన్ని అప్‌డేట్లను అందిస్తోంది. ముఖ్యంగా “న్యూరల్ హ్యాండ్‌రైటింగ్” ఫీచర్‌ టెక్నాలజీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఫోన్ లేదా కీబోర్డ్‌ను ఉపయోగించకుండా గాలిలో వేళ్లను కదిలిస్తూ టైప్ చేయగలుగుతారు.

గాలిలో వేళ్లు కదిపితే టైపింగ్
ఈ స్మార్ట్ గ్లాసెస్ ధరించిన వ్యక్తి గాలిలో అక్షరాల ఆకారాన్ని వేళ్లతో చూపిస్తే, ఆ కదలికలను పరికరం గుర్తించి టెక్స్ట్‌గా మారుస్తుంది. ఉదాహరణకు “M” అక్షరాన్ని టైప్ చేయాలంటే, గాలిలో వేళ్లతో M ఆకారాన్ని రూపొందించాలి. ఆ సంకేతాన్ని సిస్టమ్ అర్థం చేసుకుని మెసేజ్‌గా మార్చుతుంది.

న్యూరల్ రిస్ట్‌బ్యాండ్ కీలకం
ఈ ఫీచర్ పనిచేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన Meta Neural Wristband ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ బ్యాండ్ చేతి కదలికలు, సంజ్ఞలను ట్రాక్ చేసి వాటిని డిజిటల్ కమాండ్లుగా అనువదిస్తుంది. దీనివల్ల టైపింగ్ మరింత సులభంగా మారుతుంది.

వాట్సాప్ సహా అన్ని మెసేజింగ్ యాప్‌లకు సపోర్ట్
ఈ అప్‌డేట్‌తో WhatsApp, Instagram, Messenger వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లతో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ మెసేజింగ్ యాప్‌లకు కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. ఇక, జెశ్చర్ ఆధారిత టైపింగ్‌తో పాటు మెటా విస్తరించిన డిస్‌ప్లే రికార్డింగ్, మెరుగైన నావిగేషన్, లైవ్ క్యాప్షన్‌ల వంటి అనేక ఆధునిక ఫీచర్లను కూడా జోడించింది. ఇవి వినియోగదారులకు మరింత స్మార్ట్ అనుభూతిని అందించనున్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ గ్లాసెస్ భారత మార్కెట్లో అందుబాటులో లేవు. అయితే త్వరలో భారత్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.