LG Hyper Radiant Color TV: అమెరికాలోని లాస్‌వేగాస్ లో జరగనున్న CES-2026 ప్రదర్శనకు ముందు ఎల్జి ఎలక్ట్రానిక్స్ (LG Electronics) కొత్త OLED టీవీ లైనప్ ను ప్రకటించింది. ఈ కొత్త సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా LG OLED evo W6 ట్రూ వైర్ లెస్ వాల్ పేపర్ టీవీ నిలిచింది. 2017లో మొదటిసారి పరిచయం చేసిన వాల్ పేపర్ డిజైన్ ను మళ్లీ తీసుకువచ్చిన ఎల్జీ, ఈసారి దాన్ని ‘ట్రూ వైర్లెస్ కనెక్టివిటీ’, అత్యాధునిక ‘హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీ’తో కలిపింది.
ఈ LG OLED evo W6 టీవీ కేవలం 9mm మందంతో రూపొందించబడింది. ఇది గోడకు పూర్తిగా అంటుకునేలా కొత్త వాల్ మౌంట్ డిజైన్ రూపొందించారు. దీని వల్ల టీవీ చూడడానికి వాల్‌పేపర్‌లా కనిపించేలా డిజైన్ చేశారు. టీవీ స్లిమ్‌గా ఉన్నప్పటికీ టీవీ బలంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
WPL 2026 Final: ఈసారైనా ‘ఢిల్లీ’ కోరిక తీరేనా? కొత్త కెప్టెన్ జట్టు తలరాత మారుస్తుందా!
ఈ టీవీలోని అన్ని ఇన్‌పుట్ పోర్టులు ‘జీరో కనెక్ట్ బాక్స్’ లో ఉంటాయి. ఈ బాక్స్‌ను టీవీ నుండి 10 మీటర్ల దూరంలో ఉంచుకోవచ్చు. దీని వల్ల టీవీ చుట్టూ వైర్ల అవసరం లేకుండా, ఇంట్లో ఎక్కడైనా సులభంగా అమర్చుకోవచ్చు. ఇందులోని కొత్త హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీతో బ్లాక్ లెవెల్స్, కలర్స్, బ్రైట్‌నెస్ మరింత మెరుగయ్యాయి. ఇంకా ‘బ్రైట్నెస్ బూస్టర్ అల్ట్రా’ సపోర్ట్‌తో ఈ వాల్‌పేపర్ టీవీ సాధారణ OLED టీవీలతో పోలిస్తే 3.9 రెట్లు ఎక్కువ ప్రకాశం అందించగలదు. అలాగే, రిఫ్లెక్షన్‌ను తగ్గించేలా రూపొందించిన ప్రత్యేక స్క్రీన్‌కు Intertek నుంచి “Reflection Free with Premium” సర్టిఫికేషన్ లభించింది.
ఈ టీవీలో α (Alpha) 11 AI ప్రాసెసర్ జెన్ 3 ఉపయోగించారు. ఇందులోని Neural Processing Unit (NPU) గత మోడళ్లతో పోలిస్తే 5.6 రెట్లు ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. దీంతో కొత్త డ్యూయల్ AI ఇంజిన్ ద్వారా మెరుగైన పిక్చర్ ప్రాసెసింగ్, స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే గేమింగ్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఈ టీవీ 4K 165Hz రిఫ్రెష్ రేట్, NVIDIA G-SYNC Compatible, AMD ఫ్రీ సింక్ ప్రీమియం వంటి ఫీచర్లను అందిస్తోంది. అలాగే 0.1ms రెస్పాన్స్ టైమ్, ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM) గేమింగ్ అనుభవాన్ని మరింత స్మూత్‌గా మారుస్తాయి.
కొత్త స్మార్ట్ టీవీలో గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కాపీలోట్ ఇంటిగ్రేషన్‌తో మల్టీ-AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల వినియోగదారులు వాయిస్ ద్వారా ప్రశ్నలు అడిగి వ్యక్తిగతీకరించిన సమాధానాలు పొందవచ్చు.
