NTV Telugu Site icon

Lava O2 Phone: లావా నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

Lava O2 2

Lava O2 2

ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ మార్కెట్ లోకి లాంచ్ అవుతున్నాయి.. ఈ మొబైల్స్ కూడా మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా లావా నుంచి అదిరిపోయే మొబైల్ లాంచ్ అయింది.. లావా o2 ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు… ఈ ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ లావా ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.. అలాగే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది.. ఈ కొత్త ఫీచర్స్ విషయానికొస్తే.. 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ యూనిసోక్ టీ616 ఎస్ఓసీపై రన్ అవుతుంది.. ఇక సెల్ఫీ ప్రియులకు అదిరిపోయేలా 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది.. అలాగే 8ఎంపీతో ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది..

అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఈ కొత్త మొబైల్ ధర విషయానికొస్తే.. ఈ కొత్త 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ 8,499. లాంచ్ ఆఫర్‌గా లావా ఫోన్‌ను రూ. 500 తగ్గింపు పొందవచ్చు. ఇంపీరియల్ గ్రీన్, మెజెస్టిక్ పర్పుల్, రాయల్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఈనెల 27 నుంచి మార్కెట్ లోకి అందుబాటులోకి రాబోతుంది.. ఇక ఫాస్ట్ చార్జింగ్ ను కలిగి ఉంటుంది.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 38 గంటల టాక్ టైమ్, 500 గంటల స్టాండ్‌బై టైమ్‌ని అందిస్తుంది.. ఇక ఈ ఫోన్ బరువును చూస్తే 200 గ్రాముల బరువును కలిగి ఉంటుంది..