Lava Yuva 3 Pro : మార్కెట్ లోకి లావా యువ ప్రో మొబైల్స్.. ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కంపెనీ మరో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లో విడుదల చేసింది.. లావా యువ3 ప్రో పేరుతో తాజాగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చింది.. సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఏజీ గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. లావా యువ 3 ప్రో యూనిసెక్ టీ616 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..
లావా యువ 3 ప్రో ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను స్వీకరించి అప్‌గ్రేడ్ చేస్తుంది. 269పీపీఐ పిక్సెల్ సాంద్రత, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్‌తో డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ యూనిసెక్ టీ616 ఎస్ఓసీపై రన్ అవుతుంది.. అంతేకాదు డ్యూయల్ సిమ్ కూడా ఉంది.. అంతేకాదు అదనపు స్టోరేజీతో ఆన్‌బోర్డ్ మెమరీని 16జీబీ వరకు విస్తరించవచ్చు.. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ వోల్ట్, బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఎసి, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది..
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
కెమెరా విషయానికొస్తే.. స్క్రీన్ ఫ్లాష్‌తో ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరా సెన్సార్ అందిస్తుంది. ఈ ఫోన్ 128జీబీ ఇంటర్నల్ యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించవచ్చు.. ఇంకా మరెన్నో ఫీచర్స్ ను కలిగి ఉంది.. 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో కొత్త యువ 3 ప్రోలో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసింది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 38 గంటల టాక్ టైమ్ వస్తుంది.. ఈ ఫోన్ బరువు 200 గ్రాములు.. ఇక ధరను చూస్తే.. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 8,999కు పొందవచ్చు. ఈ కొత్త ఫోన్ లావా ఇ-స్టోర్‌లో డెసర్ట్ గోల్డ్, ఫారెస్ట్ విరిడియన్, మెడో పర్పుల్ కలర్ లలో లభిస్తుంది..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!