Lava Virat V1 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుండి ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత పెంచింది. ఇప్పటికే 64GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులో ఉన్న లావా విరాట్ V1 5Gకి తాజాగా 128GB స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఆన్‌లైన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు.
కొత్త వేరియంట్:
ఈ మొబైల్ ను కొత్త వేరియంట్‌లో 4GB LPDDR4X ర్యామ్ తో పాటు 128GB UFS 2.2 స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా ఏకంగా 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ ఫొటోలు, వీడియోలు, యాప్స్, ఇతర ఫైళ్లను స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
120Hz డిస్‌ప్లే & ప్రాసెసర్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 1612 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 550 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. రోజువారీ వినియోగంతో పాటు వీడియోలు, సోషల్ మీడియా, గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ అనుభూతిని అందిస్తుంది. పనితీరు కోసం ఇందులో Unisoc T8200 6nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 2.3GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPUను అందించారు. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
కెమెరాలు & బ్యాటరీ:
ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 13MP ప్రధాన కెమెరాను LED ఫ్లాష్‌తో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉంది. అయితే ఛార్జింగ్ స్పీడ్ 10Wకు పరిమితం చేశారు. సాధారణ వినియోగంలో ఎక్కువ కాలం బ్యాకప్ అందించడంపై ఈ ఫోన్ ప్రధానంగా దృష్టి పెట్టింది. అలాగే IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.0, GPS, GLONASS, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర:
లావా విరాట్ V1 5G 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. ఈ కొత్త వేరియంట్ సెప్టెంబర్ 2, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలకు సిద్ధంగా ఉంది. ఇంకా లావా తన “Free Service @ Home” కార్యక్రమాన్ని ఈ ఫోన్‌తో అందిస్తోంది. దీనిద్వారా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఇంటి వద్దకే సర్వీస్ సపోర్ట్ అందించనుంది.

