Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!

Lava Smart 4 Pro

Lava Smart 4 Pro

Lava Smart 4 Pro Launched: ప్రముఖ భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Lava Smart 4 Pro పేరుతో ఈ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ 7,000mAh బ్యాటరీని అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, Android 16 ఆపరేటింగ్ సిస్టమ్, 13MP కెమెరా వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.10,999గా నిర్ణయించింది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర, ఎక్కడ కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం.

Lava Smart 4 Pro స్మార్ట్‌ఫోన్‌ను 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.10,999గా ఉంది. ఈ ఫోన్ Neelam Blue, Konark Gold అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ కంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న లావా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పై ఒక సంవత్సరం హ్యాండ్‌సెట్ వారంటీ, యాక్సెసరీస్‌పై ఆరు నెలల వారంటీ లభిస్తుంది.

అంతేకాకుండా Free Service @ Home సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు ఇంటి వద్దనే అమ్మకాల తర్వాత సేవలను పొందవచ్చు. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7,000mAh Li-Ion బ్యాటరీ. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జింగ్ కోసం USB Type-C పోర్టును అందించారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ బ్యాటరీ 950 గంటల వరకు స్టాండ్‌బై టైమ్, 748 నిమిషాల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.

Lava Smart 4 Proలో 17.13 సెంటీమీటర్ల (6.75 అంగుళాల) HD+ నాచ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో UNISOC T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 4GB ఫిజికల్ RAMతో పాటు అదనంగా 4GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. మొత్తం 8GB వరకు RAM సామర్థ్యాన్ని పొందవచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 512GB వరకు విస్తరించుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13MP ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్ సపోర్ట్‌తో 5MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో ప్రకటనలు (Ads), అనవసరమైన యాప్స్ (Bloatware) ఉండవని కంపెనీ పేర్కొంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా MIL-STD-810H డ్రాప్, షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది. వినియోగదారులకు రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ వెల్లడించింది.