రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
- లావా SHARK 2 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్
- రూ.11,999 ధరతో బడ్జెట్ 5G ఫోన్‌గా అందుబాటులోకి
- 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
- UNISOC T8200 ఆక్టా-కోర్ 6nm ప్రాసెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava SHARK 2 5G Launched: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ SHARK 2 5G ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లే స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. అలాగే మొబైల్ కు ఫోన్‌కు IP64 రేటింగ్ ఇవ్వబడింది. దీని వల్ల ధూళి, నీటి చిమ్ముర్ల నుండి రక్షణ లభిస్తుంది. ఈ మొబైల్ సోనార్ గోల్డ్, ఆర్య బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ 6nm ఆధారిత UNISOC T8200 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది రోజువారీ మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదని కంపెనీ చెబుతోంది. AnTuTu బెంచ్‌మార్క్‌లో ఈ ఫోన్ 5 లక్షలకు పైగా స్కోర్ సాధించిందని కంపెనీ వెల్లడించింది. ఫోన్లో 4GB LPDDR4x ర్యామ్‌తో పాటు అదనంగా 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. స్టోరేజ్ పరంగా 64GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ అందించబడింది. మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు మెమరీని విస్తరించుకోవచ్చు.
Also Read
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
- Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
- Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
Lava SHARK 2 5Gలో 6000mAh భారీ బ్యాటరీ ఇవ్వబడింది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత క్లీన్ ఆండ్రాయిడ్ UIతో వస్తోంది. అంటే అనవసరమైన బ్లోట్‌వేర్ యాప్స్ లేదా ప్రకటనలు ఉండవు. వినియోగదారులకు స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభవం లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 13MP AI కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.

Lava SHARK 2 5G ధరను రూ. 11,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 10 నుంచి దేశవ్యాప్తంగా లావా రిటైల్ స్టోర్లలో అమ్మకలకు అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ కు కంపెనీ “Free Service @ Home” సేవను కూడా అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు ఇంటి వద్దనే కొన్న తర్వాత సపోర్ట్ పొందవచ్చు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?